బ్లాక్ లుక్ కావాలా? వైట్ లుక్ కావాలా? ఎంజీ 'హెక్టార్'లో రెండు కొత్త ఎడిషన్లు
- బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ధర రూ.20 లక్షలు
- రెండు మోడళ్లలో 1.5 లీటర్ పెట్రోల్-సీవీటీ
- 5-సీటర్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం
- ఏడీఏఎస్‌తో పాటు 360 డిగ్రీ కెమెరా
- అందుబాటులో 70కి పైగా ఐ-స్మార్ట్ ఫీచర్లు
ఎంజీ మోటార్ ఇండియా హెక్టార్ ఎస్‌యూవీలో రెండు కొత్త స్పెషల్ ఎడిషన్లను విడుదల చేసింది. బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ పేర్లతో తీసుకొచ్చిన ఈ రెండు మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరను రూ.20 లక్షలుగా నిర్ణయించింది. టాప్ స్పెసిఫికేషన్స్ ఉండే సావీ ప్రో సీవీటీతో పోలిస్తే ఇవి రూ.35,000 ఎక్కువ. ఈ రెండు ఎడిషన్లు 5-సీటర్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో సీవీటీ గేర్‌బాక్స్ కలిగి ఉంటాయి.
బ్లాక్‌స్టార్మ్ పూర్తిగా నలుపు రంగు థీమ్‌తో వచ్చింది. డార్క్ క్రోమ్ బ్యాడ్జింగ్, పియానో బ్లాక్ రూఫ్ రైల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
స్నోస్టార్మ్ మాత్రం పెర్ల్ వైట్ బాడీతో స్టార్ బ్లాక్ రూఫ్‌ను కలిగి ఉంటుంది. రెండు మోడళ్లలోనూ స్టార్మ్ హెక్స్ గ్రిల్, బ్లాక్ హెడ్‌ల్యాంప్ బెజెల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి.
రెండు ఎడిషన్లలోనూ డార్క్ క్యాబిన్, బ్లాక్ లెదర్ సీట్లు, ఫ్రంట్ హెడ్‌రెస్టులపై ఎడిషన్ పేర్ల ఎంబాసింగ్ ఉన్నాయి. 8 రంగుల యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫయర్, పవర్డ్ టెయిల్‌గేట్ అందించారు.
35.56 సెం.మీ పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్, 17.78 సెం.మీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఐ-స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా 70కి పైగా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
భద్రత కోసం 360 డిగ్రీల కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, బ్రేక్ అసిస్ట్, ఏడీఏఎస్ అందించారు.
డీలర్ వద్ద స్టార్మ్ యాక్సెసరీ ప్యాకేజీ కూడా లభిస్తుంది. 84 నెలల వరకు 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్స్ సదుపాయం అందిస్తున్నట్లు ఎంజీ తెలిపింది. మూడు సంవత్సరాల వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు ఉచిత సర్వీసులతో ఎంజీ షీల్డ్ ప్యాకేజీ కూడా ఉంది.