రక్షణ మంత్రి పర్యటనలో అపశ్రుతి.. కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్
- విశాఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
- భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సర్వీస్ రైఫిల్ ప్రమాదవశాత్తు పేలుడు
- ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
- విశాఖ ఐఎన్ఎస్ డేగా వద్ద ఘటన
- విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
విశాఖపట్నంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా భద్రతా విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సర్వీస్ రైఫిల్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అప్పలకొండ తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగా వద్ద ఈ సంఘటన జరిగింది.
రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించాల్సిన విమానం వద్ద ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ అప్పలకొండ భద్రతా విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన చేతిలోని సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్‌ఆర్) అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ ఆయన ఛాతీ ఎడమవైపు భాగంలోకి దూసుకెళ్లింది.
పెద్ద శబ్దం వినపడటంతో భద్రతా సిబ్బంది, ఇతర అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అప్పలకొండను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదం జరిగిన తీరుపై విచారణకు ఆదేశించారు.
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)లో ఫ్లీట్ సపోర్ట్ షిప్-1 (ఎఫ్‌ఎస్‌ఎస్-1)ను ప్రారంభించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ఫ్లీట్ సపోర్ట్ షిప్-5 (ఎఫ్‌ఎస్‌ఎస్-5) కీల్ లేయింగ్, ఆధునికీకరించిన స్లిప్‌వే-4, 300 టన్నుల గోలియత్ క్రేన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన ఒడిశాలోని కోరాపుట్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి, విశాఖ ఎంపీ శ్రీభరత్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.