సీఎం విజయ్ తనయుడి దర్శకత్వంలో 'సిగ్మా'.. రేపే విడుదల.. దుష్ప్రచారం చేస్తున్నారంటూ సందీప్ కిషన్ ఫైర్

సీఎం విజయ్ తనయుడి దర్శకత్వంలో 'సిగ్మా'.. రేపే విడుదల.. దుష్ప్రచారం చేస్తున్నారంటూ సందీప్ కిషన్ ఫైర్

Sundeep Kishan lashes out at negative campaign as Jason Sanjay Sigma releases tomorrow
  • సిగ్మా చిత్రంపై నెగెటివ్ ప్రచారమంటూ సందీప్ కిషన్ ఆగ్రహం
  • కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసంటూ తీవ్ర హెచ్చరిక
  • తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం
  • రేపే తెలుగు, తమిళ భాషల్లో సిగ్మా మూవీ విడుదల
  • నా కంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుందంటూ సందీప్ కిషన్ వ్యాఖ్య
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'సిగ్మా' చిత్రం రేపు (అక్టోబర్ 2) విడుదల కానుంది. ఈ కీలక తరుణంలో సినిమా హీరో సందీప్ కిషన్, తన చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కుట్రపూరితంగా తన సినిమాను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి సంగతి తేలుస్తానంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ఈ మేరకు సందీప్ కిషన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. "గత కొద్ది రోజులుగా నాపైనా, నా సినిమాపైనా లక్ష్యంగా చేసుకుని కొన్ని పోస్టులు చూస్తున్నాను. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో నాకు బాగా తెలుసు. ఇది ఇలాగే కొనసాగితే వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. నా కంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. నేరుగా రంగంలోకి దిగితే అందరి బండారం బయటపడుతుంది. జాగ్రత్త" అని తన పోస్టులో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

యాక్షన్ అడ్వెంచర్, ట్రెజర్ హంట్ కథాంశంతో 'సిగ్మా' తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా, రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఎన్వీఆర్ సినిమాస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు సందీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
Sundeep Kishan
Sigma Movie
Jason Sanjay
Lyca Productions
Faria Abdullah
Sigma Release

More Telugu News