సీఎం విజయ్ కొడుకు దర్శకత్వంలో సందీప్ కిషన్.. 'సిగ్మా'కు సెన్సార్ పూర్తి
- సందీప్ కిషన్ నటించిన ‘సిగ్మా’ చిత్రానికి U/A సర్టిఫికేట్
- తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం
- అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
- తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సిగ్మా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్' (సీబీఎఫ్‌సీ) ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
నిర్మాత జీకేఎం తమిళ్ కుమరన్ ఈ విషయాన్ని తన 'ఎక్స్' ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్నట్లు తెలుపుతూ, U/A సర్టిఫికేట్ పొందిన కొత్త పోస్టర్‌ను ఆయన పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రకారం.. ఇది యాక్షన్, అడ్వెంచర్, హెయిస్ట్ కామెడీ జానర్‌లో రూపొందింది. రూ. 500 కోట్ల విలువైన డ్రగ్స్, గ్యాంబ్లింగ్ రాకెట్ చుట్టూ కథ నడుస్తుంది. మోసపోయిన హీరో (సందీప్ కిషన్) తన స్నేహితులతో కలిసి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది కథాంశం.
ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించగా, సంపత్ రాజ్, రాజు సుందరం, శివ పండిట్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. కోస్తా ఆంధ్ర, తెలంగాణలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమాస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.