8 వారాలు కాదు.. ఇక 2 గంటలే.. బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణకు 'గేమ్‌ఛేంజర్' టెస్ట్!
- బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణలో విప్లవాత్మక ర్యాపిడ్ జెనోమిక్ టెస్ట్
- 8 వారాల నిర్ధారణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గించిన టెక్నాలజీ
- ఆపరేషన్ జరుగుతుండగానే కణితి జన్యు ప్రొఫైల్‌ను విశ్లేషించే విధానం
- రోగులకు త్వరగా చికిత్స అందించేందుకు ఉపయోగం
- ఇంగ్లండ్‌లోని పలు ఎన్‌హెచ్‌ఎస్ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు
మెదడు క్యాన్సర్ (బ్రెయిన్ ట్యూమర్) నిర్ధారణలో వైద్య రంగం ఓ భారీ ముందడుగు వేసింది. ఇప్పటివరకు ఫలితాల కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితికి తెరదించుతూ, కేవలం రెండు గంటల్లోనే కణితిని నిర్ధారించే సరికొత్త ర్యాపిడ్ జెనోమిక్ టెస్టును అభివృద్ధి చేశారు. ఈ విప్లవాత్మక విధానం రోగికి ఆపరేషన్ జరుగుతుండగానే కణితికి సంబంధించిన పూర్తి వివరాలు వైద్యులకు అందుతాయి. ఇంగ్లండ్‌లోని 'నేషనల్ హెల్త్ సర్వీస్' (ఎన్‌హెచ్‌ఎస్) కేంద్రాల్లో ప్రస్తుతం ఈ పరీక్షను పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు.
నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలోని బ్రెయిన్ ట్యూమర్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిశోధకులు ఈ అధునాతన పరీక్షను అభివృద్ధి చేశారు. ఆపరేషన్ సమయంలో తీసిన కణితి నుంచి చిన్న శాంపిల్‌ను వెంటనే పాథాలజీ ల్యాబొరేటరీకి పంపుతారు. అక్కడ ఆక్స్‌ఫర్డ్ నానోపోర్ అనే కాంపాక్ట్ సీక్వెన్సింగ్ మెషీన్‌లో ఈ శాంపిల్‌ను ఉంచుతారు. ఈ యంత్రంలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా కణితిలోని డీఎన్ఏ అణువులు ప్రయాణిస్తున్నప్పుడు, దాని జన్యుపరమైన ప్రొఫైల్ బయటపడుతుంది. ఈ సమాచారంతో గంటల వ్యవధిలోనే అది ఏ రకమైన కణితో వైద్యులు వర్గీకరించగలుగుతారు.
ఈ విధానాన్ని వైద్య నిపుణులు 'గేమ్‌ఛేంజర్'గా అభివర్ణిస్తున్నారు. సర్జరీ సమయంలోనే కణితి గురించి పూర్తి సమాచారం అందడం వల్ల, ఎలాంటి చికిత్సా నిర్ణయాలు తీసుకోవాలో వైద్యులకు స్పష్టత వస్తుంది. దీనిపై ఎన్‌హెచ్‌ఎస్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంకీ స్వోర్డ్స్ మాట్లాడుతూ.. "ఇది రోగుల విషయంలో ఒక పెద్ద ముందడుగు. బ్రెయిన్ ట్యూమర్ల నిర్ధారణ విధానాన్ని ఇది పూర్తిగా మార్చేయగలదు" అని తెలిపారు.
నాటింగ్‌హామ్ రీసెర్చ్ సెంటర్ సహ-లీడ్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ స్టువర్ట్ స్మిత్ మాట్లాడుతూ.. "సమయం చాలా తక్కువగా ఉన్న రోగులకు, ఆపరేషన్ థియేటర్‌లో ఉండగానే కీలక సమాచారం అందించడం ఎంతో ముఖ్యం" అని వివరించారు.
యూకేలో 40 ఏళ్లలోపు వయసున్న వారిలో సంభవించే మరణాలకు బ్రెయిన్ ట్యూమర్లు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త పరీక్ష ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం నాటింగ్‌హామ్, బర్మింగ్‌హామ్, గ్రేట్ ఆర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్, కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, న్యూకాజిల్ సహా ఐదు ప్రత్యేక కేంద్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది.
భవిష్యత్తులో బ్రిస్టల్, ఆక్స్‌ఫర్డ్, లీడ్స్, మాంచెస్టర్ వంటి నగరాలకు కూడా దీనిని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వేగవంతమైన నిర్ధారణ వల్ల రోగులు, వారి కుటుంబసభ్యులలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోవడమే కాకుండా రేడియోథెరపీ లేదా కీమోథెరపీ వంటి చికిత్సలను వెంటనే ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది. అలాగే, క్లినికల్ ట్రయల్స్‌కు అర్హులైన వారికి అవకాశాలు మెరుగవుతాయి.