మహేశ్ గౌడ్, అద్దంకి దయాకర్ లపై పరువునష్టం పిటిషన్లను కోర్టు స్వీకరించింది: హరీశ్ రావు

మహేశ్ గౌడ్, అద్దంకి దయాకర్ లపై పరువునష్టం పిటిషన్లను కోర్టు స్వీకరించింది: హరీశ్ రావు

Harish Rao says court accepted defamation petitions against Mahesh Goud and Addanki Dayakar
  • తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేశారంటూ హరీశ్ మండిపాటు
  • ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిందలు వేస్తున్నారని విమర్శ
  • ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం దారుణమని వ్యాఖ్య

తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు తెలిపారు. ఈ విషయంలో సెప్టెంబర్ 30న తన స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు కోర్టు అనుమతించిందని వెల్లడించారు. నాంపల్లి కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తమపై ఈ తరహా నీచమైన నిందలు వేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం దారుణమని అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను కూడా స్పీకర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 


ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటివని అభివర్ణించారు. లోక్‌సభలో రాజ్యాంగ సంరక్షకుడిగా మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు స్పీకర్ ప్రయత్నించారని, అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో అనర్హత వేటు తప్పదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఫిరాయింపు నేతలు రాజీనామాలు చేసి ప్రజా తీర్పును కోరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.   

Advertisement
Harish Rao
Mahesh Kumar Goud
Addanki Dayakar
Defamation Case
BRS
Nampally Court

More Telugu News