దానం నాగేందర్ అనర్హతపై కౌశిక్ రెడ్డి హర్షం
- దానం పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతించిన కౌశిక్ రెడ్డి
- పార్టీ మారిన వారిపై వేటు వేయాలన్న తమ వాదనకు బలం చేకూరిందని వ్యాఖ్య
- న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులను గౌరవించాలని హితవు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో న్యాయపోరాటం చేసి కావాల్సిన ఫలితం సాధించామని ఆయన అన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న తమ వాదనకు ఈ తీర్పు బలం చేకూర్చిందని స్పష్టం చేశారు.
ఇదే సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల తీరుపై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయని, పెద్ద ఎత్తున కుమ్మక్కు రాజకీయం సాగుతోందని ఆరోపించారు. ఒకరి స్వార్థం కోసం మరొకరు సహకరిస్తూ నాటకాలు ఆడుతున్నారని, ఇది సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కోర్టులు వేగంగా తీర్పులు ఇస్తున్నాయని కొందరు ఎద్దేవా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. న్యాయస్థానాల వేగాన్ని, విచారణ తీరును తక్కువ చేసి మాట్లాడటం అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. చట్టం తన పని తాను చేస్తుందని, న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పులను గౌరవించాలని సూచించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.