రూ.60 వేలకే రూ.1.34 లక్షల ఐఫోన్ 17 ప్రో.. రిలయన్స్ డిజిటల్ ఆఫర్ ఇదే
- 256జీబీ మోడల్ రూ.56,990కే
- రూ.55 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ విలువ
- అదనంగా రూ.10 వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్
- రూ.3 వేల వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్
- ఇవే ఆఫర్లతో 17 ప్రో మ్యాక్స్ రూ.71,990కి
- పాత ఫోన్ విలువను బట్టి ధర మారే అవకాశం
కొత్త ఐఫోన్ 18 సిరీస్ మార్కెట్లోకి వచ్చేసింది. దీంతో గతేడాది వచ్చిన ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ డిజిటల్ ఈ ఫోన్ 256జీబీ వేరియంట్‌ను పలు ఆఫర్లతో కలిపి రూ.60 వేలలోపే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఎక్స్‌ఛేంజ్, అదనపు బోనస్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కలిపితే ఈ ధరకు ఫోన్ దక్కనుంది.
ఐఫోన్ 17 ప్రో 256జీబీ అసలు ధర రూ.1,34,900. రిలయన్స్ డిజిటల్ ఇన్‌స్టోర్ డిస్కౌంట్‌గా రూ.9,910 తగ్గిస్తోంది. దీంతో ధర రూ.1,24,990కి వస్తుంది. ఆ తర్వాత పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై గరిష్ఠంగా రూ.55,000 వరకు విలువ లభిస్తుంది. దీనికి అదనంగా రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఇవన్నీ వర్తిస్తే ఫోన్ ధర రూ.56,990కి తగ్గుతుంది.
అయితే రూ.55 వేల ఎక్స్‌ఛేంజ్ విలువ ప్రతి ఫోన్‌కు వర్తించదు. రిలయన్స్ డిజిటల్ చూపించిన లెక్క ఐఫోన్ 15 ప్రో ఎక్స్‌ఛేంజ్‌ను ఆధారంగా చేసుకుంది. పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితి, అర్హతను బట్టి అసలు ఎక్స్‌ఛేంజ్ విలువ మారొచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు నిబంధనలు పరిశీలించాలి.
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీపై కూడా ఇదే తరహా ఆఫర్ ఉంది. దీని ధర రూ.1,49,900 కాగా.. అన్ని ప్రయోజనాలు వర్తిస్తే రూ.71,990కి తగ్గుతుంది.
ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడళ్లలో ఏ19 ప్రో చిప్, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, 48MP వెనుక కెమెరా సిస్టమ్, 18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ.1,64,900గా ఉంది.