28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత రాష్ట్రాలకు కొత్త ఇంచార్జ్‌లను నియమించిన బీజేపీ అధిష్ఠానం
- ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా అర్వింద్ భదౌరియా
- తెలంగాణ ఇంచార్జ్‌గా సునీల్ భన్సల్
- ఒడిశా ఇంచార్జ్‌గా పురందేశ్వరి
రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని భారీగా ప్రక్షాళన చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇంచార్జ్‌లు, సహ-ఇంచార్జ్‌ల జాబితాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా ప్రకటించారు. ప్రాంతీయ రాజకీయ సమీకరణలు, ఎన్నికల వ్యూహాలను ప్రామాణికంగా తీసుకుని కీలక నేతలకు ఈ బాధ్యతలు కట్టబెట్టారు.
తెలంగాణ: సునీల్ భన్సల్ ఇంచార్జ్‌గా వ్యవహరించనుండగా, అభయ్ పాటిల్, రేఖా శర్మ సహ-ఇంచార్జ్‌లుగా నియమితులయ్యారు. (సునీల్ భన్సల్ పశ్చిమ బెంగాల్ ఇంచార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు).
ఆంధ్రప్రదేశ్: అర్వింద్ భదౌరియా ఇంచార్జ్‌గా, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ సహ-ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు.
తమిళనాడు: రామ్ మాధవ్ ఇంచార్జ్‌గా ఎంపికవ్వగా, కో-ఇంచార్జ్‌లుగా డీకే అరుణ, నిర్మల్ కుమార్ సురాణా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఒడిశా: దగ్గుబాటి పురందేశ్వరి ఇంచార్జ్‌గా, డాక్టర్ స్వదేశ్ సింగ్ సహ-ఇంచార్జ్‌గా నియమితులయ్యారు.
కర్ణాటక: హరీశ్ ద్వివేది ఇంచార్జ్‌గా... తెలంగాణకు చెందిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు సహ-ఇంచార్జ్‌గా ఎంపికయ్యారు.
ఉత్తర ప్రదేశ్: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న యూపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఇంచార్జ్‌గా ఎంపికయ్యారు. ఆయనకు తోడుగా నలుగురు సహ-ఇంచార్జ్‌లను కేటాయించారు.
మహారాష్ట్ర: బైజయంత్ జయ్ పాండా ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు. ఆయనకు సహాయంగా అమిత్ మాలవీయ, సదానంద్ షెట్ తనవాడే, కమల్‌జీత్ సెహ్రావత్‌లను సహ-ఇంచార్జ్‌లుగా నియమించారు.
ఛత్తీస్‌గఢ్ - హర్యానా: మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఈ రెండు రాష్ట్రాల ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు.
ఢిల్లీ: డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే ఇంచార్జ్‌గా, జాంయాంగ్ త్సేరింగ్ నామ్‌గ్యాల్, దర్శనాబెన్ జర్దోష్‌లను కో-ఇంచార్జ్‌లుగా నియమించారు.
గుజరాత్: తరుణ్ చుగ్ ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
హిమాచల్ ప్రదేశ్: శ్రీకాంత్ శర్మ ఇంచార్జ్‌గా వ్యవహరించనున్నారు.
మధ్యప్రదేశ్: మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ ఇంచార్జ్‌గా నియమితులయ్యారు.


