320 కి.మీ వేగంతో వెళ్లేటప్పుడు ట్రాక్ మారితే బుల్లెట్ రైలు పట్టాలు తప్పదా?
- ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌లో ప్రత్యేక సాంకేతికత
- బుల్లెట్ ట్రైన్ మార్గంలో ‘క్యాంటెడ్ టర్నౌట్’ అనే ప్రత్యేక వ్యవస్థ
- మలుపుల్లో రైలు సాఫీగా వెళ్లేందుకు పట్టాలకు కొంత వాలు
- ట్రాక్ మారే చోట కూడా ఈ వాలు కొనసాగేటట్లు క్యాంటెడ్ టర్నౌట్
- సరైన స్థానంలో లాక్ చేసే ‘పాయింట్ మెషీన్లు’ కూడా కీలకం
గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే రైలు.. ఊహించుకుంటేనే ఆసక్తిగా ఉంటుంది. కానీ ఇంత వేగంతో వెళ్తున్న సమయంలో ట్రాక్ మార్చాల్సి వస్తే? సాధారణ రైలులో ట్రాక్ మారేటప్పుడు చిన్నపాటి కుదుపు అనిపిస్తుంది. మరి బుల్లెట్ ట్రైన్ విషయంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాక్ మార్చేలా ప్రత్యేక సాంకేతికతను ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌లో ఉపయోగిస్తున్నారు.
ట్రాక్ మారేటప్పుడు ఏం జరుగుతుంది?
రైలు ఒక పట్టా నుంచి మరో పట్టాలోకి వెళ్లే చోట ట్రాక్ ఆకారం మారుతుంది. సాధారణ రైళ్లు తక్కువ వేగంతో వెళ్లేలా ఈ ప్రాంతాన్ని రూపొందిస్తారు. వేగం పెరిగినప్పుడు పట్టాల మధ్య జరిగే ఈ మార్పు రైలుపై ఒక్కసారిగా ఒత్తిడిని పెంచుతుంది. దీంతో చక్రాలపై బలమైన ప్రభావం, కంపనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే గంటకు దాదాపు రూ.320 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బుల్లెట్ ట్రైన్‌కు సాధారణ విధానం సరిపోదు.
కుదుపు తగ్గించే ప్రత్యేక పట్టాలు
ఇందుకోసం బుల్లెట్ ట్రైన్ మార్గంలో ‘క్యాంటెడ్ టర్నౌట్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మలుపుల్లో రైలు సాఫీగా వెళ్లేందుకు పట్టాలకు కొంత వాలు ఇస్తారు. ట్రాక్ మారే చోట కూడా ఈ వాలు కొనసాగేటట్లు క్యాంటెడ్ టర్నౌట్‌ను రూపొందించారు. దీంతో రైలు ఒక్కసారిగా దిశ మార్చినట్లు కాకుండా క్రమంగా మరో పట్టాలోకి వెళ్తుంది. ఫలితంగా ప్రయాణికులకు కుదుపులు, కంపనలు తక్కువగా అనిపిస్తాయి.
రైలు మాత్రమే కాదు.. పట్టాలకూ మేలు
ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికుల సౌకర్యంతో పాటు రైలు చక్రాలు, పట్టాలపై పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. దాంతో చక్రాలు, పట్టాలు త్వరగా అరిగిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ట్రాక్‌ను మార్చే భాగాలను కదిలించి సరైన స్థానంలో లాక్ చేసే ‘పాయింట్ మెషీన్లు’ కూడా కీలకంగా పనిచేస్తాయి. 320 కి.మీ వేగంతో నడిచే రైలుకు ఇవన్నీ అత్యంత కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకే సాధారణ రైల్వే వ్యవస్థలతో పోలిస్తే బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణంలో మరింత కఠినమైన ప్రమాణాలు పాటిస్తున్నారు.
508 కి.మీ మార్గంలో ఎన్నో ప్రత్యేకతలు
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్గం 508 కి.మీ పొడవుతో నిర్మితమవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా సాగే ఈ మార్గంలో ఎనిమిది పర్వత సొరంగాలు ఉన్నాయి. అంత వేగంతో రైలు సొరంగంలోకి ప్రవేశించినప్పుడు గాలి ఒత్తిడి, శబ్దం పెరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రైలు బాడీ, చక్రాలు, ఇంజిన్ వ్యవస్థ, ఇతర కీలక భాగాలపై పరీక్షలు కొనసాగుతున్నాయి. తొలి దశలో సూరత్-వాపి మధ్య సుమారు 100 కి.మీ మార్గంలో 2027 ఆగస్టు 15న సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.