బడ్జెట్‌ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. 7,000mAh బ్యాటరీతో ఎన్‌6 లైట్‌

బడ్జెట్‌ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. 7,000mAh బ్యాటరీతో ఎన్‌6 లైట్‌

OnePlus N6 Lite launched in budget segment with 7000mAh battery
  • ఫోన్‌ ధర రూ.16,999
  • 6.75 అంగుళాల 120Hz డిస్‌ప్లే
  • 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
  • వెనుక 13MP కెమెరా
  • మిడ్‌నైట్‌ హైప్‌, నియో గ్రీన్‌ రంగుల్లో లభ్యం
వన్‌ప్లస్‌ నుంచి కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి వచ్చింది. వన్‌ప్లస్‌ ఎన్‌6 లైట్‌ 4జీ పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, భారీ 7,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.16,999గా కంపెనీ నిర్ణయించింది. మిడ్‌నైట్‌ హైప్‌, నియో గ్రీన్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ ఎన్‌6 లైట్‌ 4జీలో 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 1,570 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో పాటు 900 నిట్స్‌ వరకు హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 86 శాతం డీసీఐ-పీ3 కలర్‌ గామట్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

పనితీరు కోసం యూనిసాక్‌ టీ7250 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో వర్చువల్‌ ర్యామ్‌ను మరో 8జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 64జీబీ యూఎఫ్‌ఎస్‌ 2.2 స్టోరేజ్‌ ఉంది. ఫోన్‌ వేడెక్కకుండా 13,700 చదరపు మిల్లీమీటర్ల హీట్‌ డిసిపేషన్‌ ఏరియాను ఇచ్చారు.

కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు 13ఎంపీ ప్రధాన కెమెరా, ముందువైపు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఐపీ64 రేటింగ్‌తో దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ లభిస్తుంది. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్‌ ప్రమాణాలను ఫోన్‌ అందుకుంటుందని వన్‌ప్లస్‌ తెలిపింది.

బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. 7,000mAh బ్యాటరీతో పాటు 15W వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. 5W రివర్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ కూడా అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 49.7 గంటల వరకు కాలింగ్‌ సమయం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ ఉన్నాయి.
Advertisement
OnePlus N6 Lite
OnePlus budget smartphone
7000mAh battery phone
OnePlus N6 Lite price India
OnePlus N6 Lite specifications
Unisoc T7250 smartphone

More Telugu News