యూపీఐ ఛార్జీలు వద్దు.. కేంద్రానికి మొబైల్ రిటైలర్ల విజ్ఞప్తి
- యూపీఐ చెల్లింపులపై ఛార్జీల నుంచి మినహాయింపు కోరిన రిటైలర్లు
- అతి తక్కువ లాభాలతో వ్యాపారం చేస్తున్నామని ఆవేదన
- 0.4 శాతం ఎండీఆర్ విధిస్తే వ్యాపార మనుగడకే ప్రమాదమని హెచ్చరిక
- ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయని వెల్లడి
- ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసిన మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్
యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) లేదా ఇతర అదనపు ఛార్జీల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే అత్యల్ప లాభాలతో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, ఈ అదనపు భారం తమ మనుగడను దెబ్బతీస్తుందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏఐఎంఆర్ఏ లేఖ రాసింది.
దేశవ్యాప్తంగా 1.50 లక్షల మందికి పైగా చిన్న, మధ్య తరహా మొబైల్, ఎలక్ట్రానిక్స్ రిటైలర్లకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. తాము కేవలం 0.75% నుంచి 1.5% నికర లాభాలతో వ్యాపారాలు సాగిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో యూపీఐ లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తే అది నేరుగా తమ లాభాలను హరిస్తుందని పేర్కొంది. ఉదాహరణకు, నెలకు రూ. 10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు జరిపే రిటైలర్‌పై ప్రతి నెలా రూ.4,000 నుంచి రూ. 16,000 వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని వివరించింది.
విక్రయాలు పడిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో మొబైల్ రిటైల్ రంగం ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని అసోసియేషన్ తెలిపింది. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని, 2025లో రూ. 10,000కు లభించిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం రూ. 17,000కు చేరిందని, 2026 డిసెంబర్ నాటికి ఇది రూ. 20,000కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా రిటైలర్లకు యూపీఐ ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను కొనసాగించాలని ఏఐఎంఆర్ఏ ప్రభుత్వాన్ని కోరింది. ఫీజుల నిర్మాణంపై నిర్ణయం తీసుకునే ముందు వాణిజ్య సంఘాలతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేసింది.