దుబాయ్‌లో ఐఫోన్ చౌక.. టికెట్, వీసా వ్యయం కలిపి చూస్తే లాభదాయకమేనా?
- దుబాయ్‌లో ఐఫోన్ 18 ప్రో ధర సుమారు రూ.1.33 లక్షలు
- భారత్‌లో అదే మోడల్ ధర రూ.1,64,900
- ప్రో మ్యాక్స్ దుబాయ్ ధర సుమారు రూ.1.43 లక్షలు
- భారత్‌లో ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,79,900
- ప్రయాణ, కస్టమ్స్ ఖర్చులతోనే తేలనున్న అసలు ఆదా లెక్క
ఐఫోన్ అంటే చాలామందికి క్రేజ్. కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చిందంటే ధర ఎంతైనా సరే కొనాలనుకునేవారు ఉంటారు. అయితే ఈసారి కొందరు భారతీయులు మరో అడుగు ముందుకేశారు. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ కొనుగోలు కోసం ఏకంగా దుబాయ్ వెళుతున్నారు. కారణం.. భారత్‌తో పోలిస్తే అక్కడ కనిపిస్తున్న ధర వ్యత్యాసం. ప్రయాణ ఖర్చులు, వీసా వ్యయం కలిపినా లెక్క కలిసొస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దుబాయ్‌లో ఎంత తక్కువ?
యూఏఈలో ఐఫోన్ 18 ప్రో 256జీబీ ధర 5,099 దిర్హామ్‌లు. ప్రస్తుత మారకం విలువ ప్రకారం ఇది సుమారు రూ.1.33 లక్షలు. భారత్‌లో ఇదే మోడల్ ప్రారంభ ధర రూ.1,64,900. అంటే దాదాపు రూ.31,900 వ్యత్యాసం ఉంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256జీబీ యూఏఈ ధర 5,499 దిర్హామ్‌లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.43 లక్షలు. భారత్‌లో ప్రారంభ ధర రూ.1,79,900. అంటే దాదాపు రూ.36,500 తేడా కనిపిస్తోంది.
ప్రయాణంతో కలిపితే లెక్క ఎలా?
దుబాయ్‌లో ఐఫోన్ ధర తక్కువగా కనిపించినంత మాత్రాన డబ్బు ఆదా అవుతుందని కాదు. విమాన టికెట్, వీసా, అక్కడి వసతి, ఇతర ప్రయాణ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అందుకే ప్రత్యేకంగా ఒక్క ఐఫోన్ కొనడం కోసమే దుబాయ్ వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కొనుగోలుదారులు చెబుతున్నారు.
ఇప్పటికే దుబాయ్‌లో ఏదైనా పని ఉంటే.. లేదా కుటుంబాన్ని కలవడానికి, సెలవుల కోసం అక్కడికి వెళ్లే ప్లాన్ ఉంటే.. అదే ట్రిప్‌లో ఐఫోన్ కొనడం వల్ల లెక్క అనుకూలంగా మారొచ్చు. అలాగే ఒకేసారి రెండు, మూడు ఫోన్లు కొనుగోలు చేస్తే ధరలో ఉన్న వ్యత్యాసం వల్ల ప్రయాణ ఖర్చును కొంతవరకు భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది.
కేరళకు చెందిన మహమ్మద్ సయీద్ కుటుంబాన్ని కలిసేందుకు దుబాయ్ వెళ్లారు. భారత్, యూఏఈ ధరలను పోల్చిన తర్వాత అక్కడే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేశారు. తనకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదా అవుతోందని ఆయన గల్ఫ్ న్యూస్‌తో చెప్పారు.
అందుకే ‘దుబాయ్‌లో ఐఫోన్ చౌక.. కాబట్టి అక్కడికే వెళ్లి కొనాలి’ అనే లెక్క కంటే.. మొత్తం ట్రిప్ ఖర్చు ఎంత? ఇప్పటికే దుబాయ్ వెళ్లే పని ఉందా? ఎన్ని ఫోన్లు కొనుగోలు చేస్తున్నాం? అనే అంశాలను కలిపి చూసినప్పుడే నిజమైన ఆదా ఎంత అనేది తెలుస్తుంది.
దుబాయ్‌లో ఎందుకు చౌక?
ధరల్లో తేడాకు పన్నులు ప్రధాన కారణాల్లో ఒకటి. యూఏఈలో 5 శాతం వ్యాట్ ఉంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్లపై పన్నులు, దిగుమతి సుంకాలు భిన్నంగా ఉంటాయి. దీంతో ఖరీదైన ఫోన్ల విషయంలో ధర వ్యత్యాసం వేల రూపాయలకు చేరుతోంది. అయితే విదేశాల నుంచి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొచ్చేటప్పుడు కస్టమ్స్ నిబంధనలు, వర్తించే పరిమితులను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.
మలేసియా ధర కూడా ఆసక్తికరమే
దుబాయ్‌తో పాటు ఆగ్నేయాసియా మార్కెట్లలోనూ ధరల్లో తేడా కనిపిస్తోంది. 256జీబీ ఐఫోన్ 18 ప్రో మలేసియాలో 5,499 రింగిట్‌లు. ఇది సుమారు రూ.1.29 లక్షలు. థాయ్‌లాండ్‌లో 48,900 బాత్‌లు.. అంటే దాదాపు రూ.1.41 లక్షలు. సింగపూర్‌లో 1,899 సింగపూర్ డాలర్లు.. సుమారు రూ.1.43 లక్షలు. వియత్నాంలో 3.8999 కోట్ల డాంగ్‌లు.. సుమారు రూ.1.44 లక్షలు. ఫిలిప్పీన్స్‌లో 94,990 పెసోలు.. దాదాపు రూ.1.45 లక్షలు.
అందుకే విదేశాల్లో ఐఫోన్ కొనాలనుకునేవారు ఫోన్ ధర ఒక్కటే కాకుండా విమాన టికెట్, వసతి, వీసా, కస్టమ్స్ నిబంధనలు వంటి అన్ని ఖర్చులనూ కలిపి లెక్కించాలి. అప్పుడే నిజంగా ఎంత ఆదా అవుతుందో స్పష్టమవుతుంది.