ఐఫోన్‌కు స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టొద్దంటున్న యాపిల్ బాస్.. ఎందుకో చూద్దాం..!
- ఐఫోన్‌కు స్క్రీన్ ప్రొటెక్టర్ అవసరం లేదంటున్న హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మారీబ్
- ఐఫోన్ల తెరలను సిరామిక్ షీల్డ్ 2తో తయారు చేస్తున్నట్లు వివరణ
- గీతలను తట్టుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు వెల్లడి
- ఐదేళ్ల వాడకాన్ని ముందే పరీక్షిస్తున్నట్లు వెల్లడి
- అయితే జారిపడితే డిస్‌ప్లే దెబ్బతినే అవకాశం మాత్రం ఉందంటున్న నిపుణులు
కొత్త ఐఫోన్ కొనగానే చాలామంది చేసే మొదటి పని ఏంటి? ఫోన్‌కు కవర్ వేయడం.. స్క్రీన్‌కు టెంపర్డ్ గ్లాస్ పెట్టించడం! ఖరీదైన ఫోన్ కాబట్టి పడిపోయినా, గీతలు పడినా డిస్‌ప్లే దెబ్బతినకూడదని ఇలా చేస్తుంటారు. కానీ యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మారీబ్ మాత్రం ఐఫోన్‌కు స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టడాన్ని ఇష్టపడటం లేదట. టెక్‌రాడార్‌తో మాట్లాడుతూ.. ఐఫోన్‌పై స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టినప్పుడు చూస్తే తనకు అసహనంగా ఉంటుందని చెప్పారు.
అసలు ఎందుకు వద్దంటున్నారు?
ఐఫోన్ డిస్‌ప్లేను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నామని మారీబ్ తెలిపారు. తాజా ఐఫోన్లలో ఉపయోగిస్తున్న సిరామిక్ షీల్డ్ 2ను గీతలను తట్టుకునేలా, ఎక్కువ కాలం మన్నేలా తయారు చేశామని చెప్పారు. యాపిల్ అధికారిక సమాచారం ప్రకారం సిరామిక్ షీల్డ్ 2కు గత తరం షీల్డ్‌తో పోలిస్తే గీతలను తట్టుకునే సామర్థ్యం మూడు రెట్లు ఎక్కువ. ఇతర స్మార్ట్‌ఫోన్లలోని గ్లాస్‌ల కంటే ఇది చాలా మన్నికైనదని యాపిల్ చెబుతోంది.
ఐదేళ్ల వాడకాన్ని ముందే పరీక్షిస్తారట!
ఫోన్‌ను వినియోగదారులు వాస్తవ జీవితంలో ఎలా ఉపయోగిస్తారో గమనించి డిస్‌ప్లేను పరీక్షిస్తున్నామని మారీబ్ చెప్పారు. స్క్రీన్‌పై గీతలు పడటం, నిరంతరం తాకడం వల్ల ఉపరితలంపై వచ్చే మార్పులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. కొన్ని వారాల పరీక్షల్లోనే ఐదేళ్లకు పైగా వాడినట్లుగా పరిస్థితులను సృష్టించి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.
మరి టెంపర్డ్ గ్లాస్ పూర్తిగా వద్దా?
ఇక్కడే అసలు విషయం ఉంది. యాపిల్ హార్డ్‌వేర్ చీఫ్ వ్యక్తిగత అభిప్రాయం చెప్పినంత మాత్రాన ప్రతి ఒక్కరూ స్క్రీన్ ప్రొటెక్టర్ తీసేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేతి నుంచి జారిపడితే డిస్‌ప్లే దెబ్బతినే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే చాలామంది ఇప్పటికీ టెంపర్డ్ గ్లాస్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే నాణ్యత లేని స్క్రీన్ ప్రొటెక్టర్ పెడితే స్క్రీన్ కనిపించే విధానం, టచ్ అనుభూతిపై ప్రభావం పడొచ్చు.