రెండు నెలల్లో రెండోసారి.. మళ్లీ ఉద్యోగులను తొలగించిన ఆపిల్
- టెక్ దిగ్గజం ఆపిల్‌లో రెండో రౌండ్ ఉద్యోగాల కోత
- ఫిట్‌నెస్ ప్లస్ ఆడియో టీమ్‌లోని పలువురు ఉద్యోగుల తొలగింపు
- ఆగస్టులో సుమారు 200 మందిని తొలగించిన ఆపిల్
- కొత్త ఆడియో కంటెంట్ ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశం
టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. రెండు నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈసారి తమ ఫిట్‌నెస్ ప్లస్ టీమ్‌లోని కొందరు ఉద్యోగులను తొలగించినట్లు ‘బ్లూమ్‌బెర్గ్’ తన నివేదికలో వెల్లడించింది. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత వారం జరిగిన ఈ తొలగింపుల ప్రభావం ప్రధానంగా ఫిట్‌నెస్ ప్లస్ ఆడియో ఫీచర్లపై పనిచేస్తున్న సిబ్బందిపై పడింది. 'టైమ్ టు వాక్', 'టైమ్ టు రన్' వంటి ఆడియో గైడెడ్ వర్క్‌అవుట్‌లను రూపొందించే టీమ్‌లోని ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఫీచర్ల ద్వారా యాపిల్ వాచ్ వినియోగదారులు వీడియో చూడకుండానే ఆడియో సూచనలతో వ్యాయామాలు చేయవచ్చు. ఈ కోతల వల్ల భవిష్యత్తులో కొత్త ఆడియో కంటెంట్ విడుదల తగ్గవచ్చని, అయితే ఈ ఫీచర్లను పూర్తిగా నిలిపివేయడం లేదని నివేదిక స్పష్టం చేసింది.
ఈ పరిణామాలను మరిన్ని ఖర్చు తగ్గింపు చర్యలకు, సర్వీస్‌లో పెద్ద మార్పులకు సంకేతంగా ఫిట్‌నెస్ ప్లస్ విభాగంలోని ఉద్యోగులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఫిట్‌నెస్ ప్లస్ సేవలను ఆపిల్ హెల్త్ యాప్‌లో విలీనం చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా, ఆగస్టు 2026లో కూడా ఆపిల్ సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించింది. సిరి, విజన్ ప్రో, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఎక్స్‌పీరియన్స్ (ఏఐ ఫీచర్లకు సంబంధించిన యూనిట్) వంటి విభాగాల్లో ఈ కోతలు జరిగాయి. 'వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించేందుకే ఈ మార్పులు చేస్తున్నామని' అప్పుడు ఆపిల్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం టెక్ రంగంలోని అనేక కంపెనీలు పునర్‌వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆపిల్ నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజా ఉద్యోగాల కోతపై ఆపిల్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.