లావా నుంచి కొత్త 5జీ ఫోన్.. రూ.13,999కే 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా!
- లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ విడుదల
- 6.75 అంగుళాల 120Hz డిస్‌ప్లే
- యూనిసాక్ టీ8200 5జీ చిప్‌సెట్
- 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
- 50MP ఏఐ డ్యూయల్ కెమెరా
దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో 6,000mAh భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 120Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ 5జీ ఫోన్ విభాగంలో దీన్ని తీసుకొచ్చింది.
లావా బోల్డ్ సిరీస్‌లో ఇది తాజా మోడల్. గత ఆగస్టులో విడుదలైన బోల్డ్ ఎన్4 లైట్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్ వచ్చింది. ఇందులో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, యానిమేషన్లు స్మూత్‌గా ఉండనున్నాయి.
ఈ ఫోన్‌లో యూనిసాక్ టీ8200 5జీ చిప్‌సెట్‌ను అమర్చారు. 6జీబీ ర్యామ్‌తో పాటు మరో 6జీబీ వర్చువల్ ర్యామ్ సదుపాయం ఉంది. 128GB స్టోరేజ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుందని లావా చెబుతోంది.
కెమెరాల విషయానికి వస్తే.. వెనుకవైపు ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. ఫోన్‌కు ఐపీ64 రేటింగ్ కూడా ఇచ్చారు. దుమ్ము, నీటి నుంచి కొంత రక్షణ లభించనుంది.
6,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో మరో ప్రధాన ఆకర్షణ. అయితే ఛార్జింగ్ సామర్థ్యానికి సంబంధించిన వివరాలను లావా వెల్లడించలేదు. మొనాకో బ్లూ, ఓపులెంట్ లిలాక్ రంగుల్లో ఇది లభించనుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా ఇంటి వద్దే ఉచిత సర్వీస్ అందించే ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ సదుపాయాన్ని కూడా లావా ప్రకటించింది.