ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్‌గా తవెంగ్వా ముకులాని.. చరిత్రలో తొలిసారిగా జింబాబ్వేకు అవకాశం
- అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో కీలక మార్పు
- ఐసీసీ కొత్త డిప్యూటీ ఛైర్మన్‌గా టవెంగ్వా ముకులానీ నియామకం
- ఈ పదవి చేపట్టిన తొలి జింబాబ్వే వ్యక్తిగా రికార్డు
- 2027 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యత
- ముకులానీ ఎన్నికను స్వాగతించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త డిప్యూటీ ఛైర్మన్‌గా జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకులాని నియమితులయ్యారు. ఐసీసీ బోర్డు డైరెక్టర్లు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఇమ్రాన్ ఖ్వాజా స్థానంలో ముకులానీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ పదవిలో 2027 నవంబర్ వరకు కొనసాగుతారు. ఈ నియామకంతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ పదవిని అలంకరించిన తొలి జింబాబ్వే వ్యక్తిగా ముకులాని చరిత్ర సృష్టించారు.
ప్రస్తుతం ముకులాని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఐసీసీలో జింబాబ్వే ప్రతినిధిగా ఉండటంతో పాటు, ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ (F&CA), నామినేషన్స్ కమిటీలలో సభ్యుడిగా, హెచ్‌ఆర్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీకి హెడ్ గానూ పనిచేస్తున్నారు.
దక్షిణాఫ్రికా, నమీబియాలతో కలిసి 2027 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు జింబాబ్వే సహ-ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో ముకులాని నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికాకు తిరిగి వస్తున్న వేళ, ఆయన అనుభవం ఐసీసీకి కీలకం కానుంది.
ఈ సందర్భంగా ముకులాని మాట్లాడుతూ.. "నాపై నమ్మకం ఉంచిన ఐసీసీ బోర్డు డైరెక్టర్లకు కృతజ్ఞతలు. ఐసీసీ ఛైర్మన్ జై షా నాయకత్వంలో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. ఆయన మార్గదర్శకత్వంలో క్రికెట్‌ను మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాను. ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం వంటి ఉత్తేజకరమైన ఈ సమయంలో, ప్రపంచ క్రికెట్ ప్రయోజనాల కోసం పనిచేస్తాను" అని తెలిపారు.
ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందిస్తూ.. "డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తవెంగ్వా ముకులానీకి అభినందనలు. క్రికెట్ పరిపాలనలో ఆయన అనుభవం, ప్రపంచ ఆటపై ఆయనకున్న అవగాహన ఐసీసీ బోర్డుకు అమూల్యమైనవి. ఆయన నియామకం జింబాబ్వేకు ఒక చారిత్రక మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను బలోపేతం చేయడానికి ఆయనతో కలిసి పనిచేస్తాను" అని పేర్కొన్నారు.