చంద్రశేఖరన్ పునర్నియామకం చట్టవిరుద్ధం: టాటా సన్స్ బోర్డుకు టాటా ట్రస్ట్స్ షాక్
- చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా సన్స్ బోర్డు తీర్మానాన్ని తిరస్కరించిన టాటా ట్రస్ట్స్
- ఈ తీర్మానం చట్ట ప్రకారం చెల్లదని, న్యాయబద్ధం కాదని స్పష్టీకరణ
- ట్రస్ట్ నామినీ డైరెక్టర్ నోయెల్ టాటా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు
- మాజీ సీజేఐ చంద్రచూడ్ న్యాయసలహాను పరిగణనలోకి తీసుకోని బోర్డు
- నాయకత్వ మార్పు ప్రక్రియ జరగాల్సిందేనని తేల్చిచెప్పిన టాటా ట్రస్ట్స్
టాటా గ్రూప్‌లో నాయకత్వ మార్పు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్‌నియామకం కోసం బోర్డు చేసిన తీర్మానాన్ని టాటా ట్రస్ట్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ తీర్మానం చట్టపరంగా చెల్లదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనితో టాటా సన్స్ బోర్డుకు, మెజారిటీ వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్‌కు మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి.
చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, తాను మళ్లీ చైర్మన్ పదవికి పోటీపడనని ఆగస్టు 12న చంద్రశేఖరన్ స్వయంగా బోర్డుకు తెలియజేశారు. ఆయన నిర్ణయాన్ని ఆమోదించిన టాటా ట్రస్ట్స్, కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయడానికి సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని మరుసటి రోజే టాటా సన్స్‌కు సూచించింది.
అయితే, గురువారం జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ను తిరిగి నియమించాలంటూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నలుగురు డైరెక్టర్లు దీనికి అనుకూలంగా ఓటు వేయగా, ట్రస్ట్ నామినీ డైరెక్టర్ అయిన నోయెల్ టాటా ఈ ప్రతిపాదనను వీటో హక్కుతో వ్యతిరేకించారు.
కంపెనీ నిబంధనల (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్) ప్రకారం, చైర్మన్ నియామకానికి లేదా పునర్‌నియామకానికి ట్రస్ట్ నామినీ డైరెక్టర్లందరి మద్దతు తప్పనిసరి. నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేసినందున ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదని టాటా ట్రస్ట్స్ వాదిస్తోంది. ఈ వాదనకు మద్దతుగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి.వై. చంద్రచూడ్ ఇచ్చిన న్యాయసలహాను కూడా నోయెల్ టాటా బోర్డు ముందు ఉంచారు. అయితే, బోర్డు దానిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. నాయకత్వ మార్పు ప్రణాళిక ప్రకారమే జరగాలని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది.