ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి: ఉదయభాను
- తన ప్రొఫెషన్ అంటే తనకి ఇష్టమన్న ఉదయభాను
- కొంతమంది తనని నిరుత్సాహ పరచడానికి ట్రై చేశారని వెల్లడి
- లేనిపోని ప్రచారాల వలన ఆఫర్లు పోయాయని ఆవేదన
- ఎవరి సపోర్టు లేకుండా ఎదిగానని వివరణ
- నిర్మాతగా మారినందుకు గర్వంగా ఉందంటూ హర్షం
ఉదయభాను .. 30 ఏళ్ల క్రితమే యాంకర్ గా ఒక టీవీ షోలో గలగలమని మాట్లాడుతూ ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే ఉదయభానుకు అప్పట్లో ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ఆ తరువాత ఒక వైపున ఈవెంట్స్ .. మరో వైపున సినిమాలు చేస్తూ ఆమె బిజీ అయ్యారు. రీసెంట్ గా 'పంచనామా' అనే వెబ్ సిరీస్ తో ఆమె నిర్మాతగా మారారు. అలాంటి ఉదయభాను తన గురించిన అనేక విషయాలను 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
"నాకు నా ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. అందువలన ఆ పనికి సంబంధించిన విషయాలను నేను సమస్యలుగా అనుకోను. నాకు సంబంధించిన వర్క్ విషయంలో నేను ఎప్పుడూ బద్ధకించలేదు .. ఎక్కడా ఆలస్యం చేయలేదు. కానీ నాకు డిసిప్లిన్ లేదనే పుకారు పుట్టించారు. అంతే కాదు ఒక ఈవెంట్ కి గానీ .. ఒక షోకి గాని నేను పెద్ద మొత్తంలో తీసుకుంటానని ప్రచారం చేస్తూ, అవకాశాలు నా వరకూ రాకుండా చేశారు. అలాంటివి విన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది" అని అన్నారు.
"నేను ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాను. కానీ నేను చాలా 'డల్' అయ్యాననే విషయాన్ని నలుగురికి తెలిసేలా చేయడానికి కొంతమంది ప్రయత్నించడం నా ముందే జరిగింది. ఇక్కడ ఎవరో మన గురించి ఒక మాట చెబితే నమ్మేస్తారే తప్ప, నేరుగా మనలను అడగరు .. అసలు విషయమేమిటనేది తెలుసుకోరు. కొన్ని షోస్ విషయంలో నన్ను పక్కన పెట్టినప్పుడు కార్లోనే కూర్చుని ఏడ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎవరెన్ని చేసినా నేను ఆగలేదు. ఎలాంటి సపోర్టు లేకుండా నిలబడగలిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది" అని అన్నారు.