12 ఏళ్ల కృషి.. 120 ఎకరాల అద్భుతం.. ఆస్ట్రేలియా ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ!

12 ఏళ్ల కృషి.. 120 ఎకరాల అద్భుతం.. ఆస్ట్రేలియా ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ!

The Bower Estate 12 years of effort 120 acres of wonder Australian family success story
  • ఆస్ట్రేలియాలో 120 ఎకరాల భూమిని పునరుద్ధరించిన ఓ కుటుంబం
  • 12 ఏళ్ల కృషితో వన్యప్రాణులకు నిలయంగా మార్పు
  • ప్రకృతి పరిరక్షణ నిధుల కోసం వెడ్డింగ్ వెన్యూగా అభివృద్ధి
  • ట్రాన్స్‌పరెంట్ మార్క్యూ, విలాసవంతమైన కాటేజీలతో పర్యాటకులకు ఆకర్షణ
  • పర్యావరణ పరిరక్షణ, వ్యాపారాన్ని జోడించి స్ఫూర్తిగా నిలుస్తున్న బౌవర్ ఎస్టేట్
ఆస్ట్రేలియాకు చెందిన ఒక కుటుంబం తమ పట్టుదలతో అసాధారణ విజయాన్ని సాధించింది. నిస్సారంగా మారిన 120 ఎకరాల భూమిని సుమారు 12 ఏళ్ల నిరంతర కృషితో ఒక పచ్చని అభయారణ్యంగా, అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

2014లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ గోల్డ్ కోస్ట్ హింటర్‌ల్యాండ్‌ ప్రాంతంలో ఈ కుటుంబం 120 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. గతంలో కలప వ్యాపారం, డెయిరీ ఫార్మింగ్ కోసం వినియోగించడం వల్ల ఆ భూమి క్రమంగా తన సారాన్ని కోల్పోయింది. అయితే, ఆ భూమిని పునరుద్ధరించాలనే సంకల్పంతో సదరు కుటుంబం మొక్కలు నాటడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టి ఆ ప్రాంత రూపురేఖలనే మార్చివేసింది. వారి కృషి ఫలితంగా దశాబ్దాలుగా కనుమరుగైన వాలబీలు, ప్లాటిపస్‌లు, కోలాస్ వంటి అరుదైన వన్యప్రాణులు తిరిగి ఆ ప్రాంతానికి రావడం మొదలుపెట్టాయి. ఈ ప్రాంతానికి 'బౌవర్ ఎస్టేట్' అని నామకరణం చేశారు.

ప్రకృతి పరిరక్షణ పనులకు అవసరమైన నిధులను సమీకరించుకోవడం కోసం, ఈ ఎస్టేట్‌ను ఒక వేడుకల వేదికగా తీర్చిదిద్దారు. సుమారు 140 మంది అతిథుల కూర్చునేలా ఇక్కడ ఒక ప్రత్యేకమైన పారదర్శక మార్క్యూను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పగటిపూట పచ్చని కొండల సౌందర్యాన్ని, రాత్రివేళ నక్షత్రమయమైన ఆకాశాన్ని వీక్షించే అద్భుత అవకాశం కలుగుతుంది. అలాగే, అక్కడి పాత ఫామ్‌హౌస్‌ను సకల సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన కాటేజ్‌గా మార్చారు.

వివాహ వేడుకలతో పాటు ఇక్కడ వెల్‌నెస్ కార్యక్రమాలు, ఎకో-ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను సైతం నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు ఆదరణ ఏ స్థాయిలో ఉందంటే, 2028 వరకు బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. పర్యావరణ పునరుద్ధరణను ఒక విజయవంతమైన వ్యాపార నమూనాతో ఎలా మేళవించవచ్చో ఈ కుటుంబం నిరూపించింది.
Advertisement
The Bower Estate
Gold Coast Hinterland
Sustainable Wedding Destination
Land Restoration Australia
Queensland Eco Tourism

More Telugu News