చిరంజీవికి జోడీగా స్నేహ..? 'కాకా'పై భారీ అంచనాలు
- చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న 'కాకా'
- చిరంజీవి భార్య పాత్రకు స్నేహను తీసుకుంటున్నట్టు వార్తలు
- ఆక్వా పరిశ్రమలో పనిచేసే ఒక సాధారణ వ్యక్తి కథాంశంతో వస్తున్న చిత్రం
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘కాకా’పై చుట్టూ ఇండస్ట్రీలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.
ఈ చిత్రంలో సీనియర్ నటి స్నేహ చిరంజీవికి జోడీగా భార్య పాత్రలో కనిపించనున్నారనే వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్లయిన నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణలతో పాటు చిరంజీవితోనూ నటించిన అరుదైన మైలురాయిని స్నేహ సొంతం చేసుకుంటారు.
మరోవైపు, చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ్యూసర్లతో చిరంజీవి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వా పరిశ్రమలో పనిచేసే ‘కె. సత్యం’ అనే సాధారణ వ్యక్తి వెనుక ఉన్న భిన్నమైన యాక్షన్ కోణంతో సాగే కథలో నటి అనశ్వర రాజన్ ‘అమ్ములు పాప’గా ముఖ్య పాత్ర పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ వేగంగా అడుగులు వేస్తున్నారు.