14 గంటల వెయిటింగ్.. గదులు లేవు, తిండి లేదు.. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల కష్టాలు!
- నాగోయాలో భారత అథ్లెట్లకు వసతి కష్టాలు
- కొందరికి ఆహారం కూడా అందుబాటులో లేక ఇబ్బందులు
- గదులు వచ్చిన వారిని ఇతరులతో సర్దుకోవాలని సూచన
- రోయర్లు, షూటర్లు సహా పలు బృందాలకు సమస్య
- ఇతర హోటళ్లకు కొందరు భారత సభ్యుల తరలింపు
- అథ్లెట్ల సంఖ్య అంచనాలో పొరపాటే కారణమని నివేదిక
ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లకు చేదు అనుభవం ఎదురైంది. అక్రిడిటేషన్లు ఉన్నప్పటికీ పలువురు క్రీడాకారులకు సకాలంలో వసతి గదులు కేటాయించలేదు. దీంతో 12 గంటలకు పైగా, కొందరు 14 గంటల వరకు గదుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆహారం కూడా అందుబాటులో లేకపోవడంతో అథ్లెట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది.
భారత రోయింగ్ బృందానికి చెందిన క్రీడాకారులు మంగళవారం ఢిల్లీ నుంచి రెండు బృందాలుగా జపాన్‌కు బయల్దేరారు. బ్యాంకాక్‌లో విరామం తర్వాత తొలి బృందం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో నాగోయా చేరుకుంది. అక్కడి నుంచి గంట తర్వాత వసతి కోసం ఏర్పాటు చేసిన క్రూజ్ నౌక వద్దకు వెళ్లారు. అయితే గదులు సిద్ధంగా లేకపోవడంతో అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది.
ఓ రోయర్ ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడుతూ.. ఉదయం 9 గంటలకు వసతి కేంద్రానికి చేరుకున్నామని, రాత్రి 8.30 గంటల సమయానికి కొద్దిమందికే గదులు లభించాయని తెలిపారు. గదులు పొందిన వారిని కూడా మరికొందరు క్రీడాకారులతో కలిసి ఉండాలని కోరినట్లు చెప్పారు.
రోయర్లే కాకుండా భారత షూటర్లు, మరో రెండు జట్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైనట్లు నివేదిక పేర్కొంది. షూటర్లకు కేటాయించిన వసతి కేంద్రాన్ని ఇతర దేశాల బృందాలకు ఇవ్వడంతో వారు మరో హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది.
భారత ఒలింపిక్ సంఘానికి చెందిన కొందరు సభ్యులను కూడా సమీపంలోని మరో హోటల్‌కు తరలించారు. వైద్య బృందం కూడా తాత్కాలికంగా వారితో కలిసి సర్దుకోవాల్సి వచ్చింది.
క్రీడాకారులు, బృందాల సంఖ్యను నిర్వాహకులు సరిగా అంచనా వేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు నివేదిక పేర్కొంది. అందుబాటులో ఉన్న వసతిలో కొంత భాగాన్ని ఇతర దేశాల బృందాలకు కేటాయించడంతో భారత అథ్లెట్లకు గదుల కొరత ఏర్పడినట్లు తెలిపింది. ఆసియా క్రీడల ఆరంభానికి ముందే వసతి ఏర్పాట్లలో తలెత్తిన ఈ గందరగోళం భారత బృందాలకు ఇబ్బందికరంగా మారింది.