పృథ్వీ షా జీవితంలో ఊహించని పరిణామం.. ఆరు నెలలకే ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌

పృథ్వీ షా జీవితంలో ఊహించని పరిణామం.. ఆరు నెలలకే ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌

Prithvi Shaw unexpected life update as engagement breaks
  • విడిపోయిన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌
  • ఎంగేజ్‌మెంట్‌ జరిగిన ఆరు నెలలకే నిర్ణయం
  • ఇద్దరి అంగీకారంతోనే విడిపోయినట్లు ఆకృతి వెల్లడి
  • భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేరని ప్రకటన
  • కారణాలపై ఊహాగానాలు చేయొద్దని ఆకృతి విజ్ఞప్తి
టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాబోయే భార్య ఆకృతి అగర్వాల్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల క్రితమే వీరి నిశ్చితార్థం జరిగింది. సోషల్‌ మీడియా ద్వారా ఆకృతి గురువారం ఈ విషయం వెల్లడించారు.

తమ భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయని గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆకృతి తెలిపారు. ఇద్దరి అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని, తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని ఆమె కోరారు.

‘‘మా భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నప్పటికీ.. మా దారులు కలిసి సాగవని అంగీకరించాం. ప్రస్తుత పరిస్థితులు, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని విడివిడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని ఆకృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 8న పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ తమ ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించాడు. ఈ సందర్భంగా పృథ్వీ షా పలు రొమాంటిక్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఓ ఫొటోలో మోకాళ్లపై కూర్చుని ఆకృతికి ప్రపోజ్‌ చేస్తున్నట్లు కనిపించాడు. మరో ఫొటోలో ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాలను చూపించారు. ‘‘మైదానంలో సిక్సర్ల నుంచి.. జీవితంలో జీవితకాల హిట్ల వరకు. ఆమె నా పర్ఫెక్ట్‌ ఇన్నింగ్స్‌’’ అంటూ అప్పట్లో పృథ్వీ షా పోస్ట్‌ చేశాడు.

తాజా ప్రకటన తర్వాత పృథ్వీ షా తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను తొలగించాడు.

ఇక క్రికెట్‌ విషయానికి వస్తే.. 2018లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రంలోనే సెంచరీతో పృథ్వీ షా ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడి కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. 2024 అక్టోబరులో ముంబయి రంజీ జట్టు నుంచి బయటకొచ్చాడు. ప్రస్తుతం మహారాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2026 వేలంలో తొలుత అమ్ముడుపోని అతడిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు.
Advertisement
Prithvi Shaw
Akriti Agarwal
Prithvi Shaw Engagement Break
Indian Cricketer
Prithvi Shaw Relationship News
Delhi Capitals Player

More Telugu News