'కాకా' రిలీజ్ పై బిగ్ అప్ డేట్.. చిరంజీవి ఫ్యాన్స్ లో జోష్
- మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘కాకా’ విడుదల తేదీ ఖరారు
- 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్
- ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న సినిమా
- త్వరలోనే తొలి సింగిల్ విడుదల చేయనున్నట్లు వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అదిరిపోయే శుభవార్త అందించింది. చిరంజీవి కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. తాజాగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. 2027 సంక్రాంతి పండగ కానుకగా జనవరి 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేయడంతో సినిమా విడుదలపై గత కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు తెరపడింది.
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్‌లో, అదే పండగ సీజన్‌కు వస్తుండటంతో ‘కాకా’పై అంచనాలు భారీగా పెరిగాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
"అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ.. 2027 సంక్రాంతికి ‘కాకా’ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారు, డైరెక్టర్ బాబీలతో మా సినిమా 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్" అని నిర్మాణ సంస్థ తమ పోస్టులో పేర్కొంది. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. విడుదల తేదీతో పాటు, తొలి సింగిల్ కూడా త్వరలో రానుండటంతో సినిమా ప్రమోషన్లు వేగం పుంజుకోనున్నాయని స్పష్టమవుతోంది.