జపాన్‌లో శాశ్వత నివాసం ఇక అంత ఈజీ కాదు.. ఏకంగా 1900 శాతం పెరిగిన ఫీజు!
- పీఆర్ ఫీజు అక్టోబర్ 1 నుంచి భారీగా పెంపు
- 2 లక్షల యెన్‌లకు చేరనున్న ఫీజు
- పీఆర్ ఫీజులో 1900 శాతం పెంపు
- ఏడాది నివాస పొడిగింపునకు 33,000 యెన్‌లు
- ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకు 75,000 యెన్‌లు
జపాన్‌లో శాశ్వతంగా స్థిరపడాలనుకునే విదేశీయులకు భారీ షాక్ తగలనుంది. అక్టోబర్ 1 నుంచి శాశ్వత నివాస అనుమతి (పీఆర్) కోసం చెల్లించే ఫీజు ఏకంగా 1900 శాతం పెరగనుంది. ప్రస్తుతం 10,000 యెన్‌లు (సుమారు రూ.6 వేలు)గా ఉన్న ఫీజు.. ఇకపై 2 లక్షల యెన్‌లు (సుమారు రూ.1.2 లక్షలు) కానుంది.
విదేశీయుల నివాస అనుమతికి సంబంధించిన ఇతర ఫీజులను కూడా జపాన్ ప్రభుత్వం పెంచింది. ఈ మార్పులకు మంగళవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్ట సవరణల్లో భాగంగా కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం నివాస అనుమతిని పొడిగించేందుకు లేదా మార్చుకునేందుకు 6,000 యెన్‌ల (సుమారు రూ.3,600) ఫీజు ఉంది. అక్టోబర్ నుంచి గడువును బట్టి ఫీజు మారుతుంది. మూడు నెలల వరకు పొడిగింపునకు 10,000 యెన్‌లు చెల్లించాలి. ఏడాది పొడిగింపునకు 33,000 యెన్‌లు (సుమారు రూ.19,800) అవుతుంది.
మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు నివాసానికి 64,000 యెన్‌లు (సుమారు రూ.38,400) చెల్లించాలి. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి 75,000 యెన్‌లు (సుమారు రూ.45 వేలు) ఫీజు ఉంటుంది.
తాత్కాలిక నివాస ప్రక్రియలకు గరిష్ఠంగా 1 లక్ష యెన్‌లు (సుమారు రూ.60 వేలు), శాశ్వత నివాస ప్రక్రియకు గరిష్ఠంగా 3 లక్షల యెన్‌లు (సుమారు రూ.1.8 లక్షలు) వరకు ఫీజు నిర్ణయించే అవకాశం ప్రభుత్వానికి ఉంది. తుది మొత్తాలను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఖరారు చేస్తారు.
అయితే ఆర్థికంగా లేదా మానవతా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరికి ఫీజులో రాయితీ లభించనుంది. జపాన్ పౌరుల పిల్లలను ఒంటరిగా పెంచుతున్న కొందరు విదేశీయులు కూడా ఈ మినహాయింపుకు అర్హులయ్యే అవకాశం ఉంది.