తండ్రుల బాటలోనే.. భారత అండర్‌-19 జట్టులోకి సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు

Aryaveer Sehwag and Anvay Dravid selected for India Under-19 team following their fathers footsteps
  • ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ఎంపిక
  • అన్వయ్‌ ద్రవిడ్‌కు భారత అండర్‌-19 జట్టులో చోటు
  • సెప్టెంబర్‌ 18న తొలి వన్డే
  • 3 వన్డేలకు రాజ్‌కోట్‌ ఆతిథ్యం
  • వన్డే కెప్టెన్‌గా లక్ష్య రైచందాని ఎంపిక
భారత క్రికెట్‌ దిగ్గజాలు విరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వారసులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా అండర్‌-19తో జరగనున్న సిరీస్‌కు భారత జట్టులో ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, అన్వయ్‌ ద్రవిడ్‌కు చోటు దక్కింది.

భారత్‌-ఆస్ట్రేలియా అండర్‌-19 జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 18, 21, 23 తేదీల్లో రాజ్‌కోట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఉంటాయి. సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు రాజ్‌కోట్‌లో తొలి మ్యాచ్‌ జరుగుతుంది. అక్టోబర్‌ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘బి’ గ్రౌండ్‌లో రెండో మ్యాచ్‌ ఉంటుంది.

వన్డే జట్టుకు లక్ష్య రైచందాని కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యశ్‌వర్ధన్‌ చౌహాన్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడు. రెడ్‌బాల్‌ మ్యాచ్‌లకు చౌహాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రైచందాని వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడు.

ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌కు ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. అన్వయ్‌ ద్రవిడ్‌ ఇటీవల శ్రీలంక పర్యటనలో రెండు వన్డేలు ఆడి 101 పరుగులు చేశాడు.

వన్డే జట్టులో ఆర్యవీర్‌, అన్వయ్‌తో పాటు మనల్‌ చౌహాన్‌, చిగురుపాటి వెంకటకు చోటు లభించింది. సాగర్‌ విర్క్‌, అన్మోల్‌జీత్‌ సింగ్‌, ఇషాన్‌ సూద్‌ వన్డే జట్టులో లేరు.
Advertisement
Aryaveer Sehwag
Anvay Dravid
India Under-19 Cricket Team
India vs Australia U19 Series
Virender Sehwag
Rahul Dravid

More Telugu News