ఈ కంపెనీలో 80 శాతం మంది ఉద్యోగులు కోటీశ్వరులు.. అదెలా సాధ్యమైంది?

Nvidia 80 percent employees are millionaires how is it possible
  • ఎన్విడియా ఉద్యోగుల్లో 80 శాతం మంది కోటీశ్వరులు
  • సగం మంది సంపద రూ.239 కోట్లు
  • 3,000 మందికి పైగా ఉద్యోగులతో సర్వే
  • ఉద్యోగులకు షేర్లపై 15 శాతం డిస్కౌంట్‌
  • ఏఐ బూమ్‌తో భారీగా పెరిగిన ఎన్విడియా షేరు
కృత్రిమ మేధ (ఏఐ) బూమ్‌ చిప్‌ దిగ్గజం ఎన్విడియా ఉద్యోగుల సంపదను భారీగా పెంచింది. ఆ సంస్థలో పనిచేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది కోటీశ్వరులుగా ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. సుమారు సగం మంది ఉద్యోగుల నికర సంపద 25 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.239 కోట్లు) దాటినట్లు తెలిపింది.

ఈ వివరాలు 2025 జూన్‌లో నిర్వహించిన అంతర్గత సర్వే ఆధారంగా వెల్లడయ్యాయి. 3,000 మందికి పైగా ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. అప్పట్లో ఎన్విడియాలో సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఉండగా.. మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని ఈ సర్వేలో భాగం చేశారు.

ఎన్విడియా ఉద్యోగుల సంపద పెరగడానికి సంస్థ షేర్లు కీలకంగా మారాయి. ఉద్యోగులు కంపెనీ షేర్లను 15 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏఐ చిప్‌లకు డిమాండ్‌ పెరగడంతో ఎన్విడియా షేరు విలువ భారీగా పెరిగింది. దీంతో షేర్లు కలిగిన ఉద్యోగుల సంపద కూడా గణనీయంగా పెరిగింది.

అయితే ఈ గణాంకాలను చూసి, ఉద్యోగుల వద్ద అంతే మొత్తంలో నగదు ఉందని అర్థం కాదు. వారి నికర సంపదలో కంపెనీ షేర్లు సహా ఇతర ఆస్తులు కూడా ఉంటాయి. ఏఐ రంగం విస్తరణతో ఎన్విడియా మార్కెట్‌ విలువ భారీగా పెరిగింది. ఆ సమయంలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4.19 లక్షల కోట్లకు పైగా.. సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ సంపద రూ.15 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Advertisement
Nvidia
Nvidia employees wealth
AI chip boom
Jensen Huang
Nvidia stock growth
Tech millionaires

More Telugu News