అదంతా నా కష్టార్జితమే: కొమురం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదంతా నా కష్టార్జితమే: కొమురం

Komuram Interview
  • తన తల్లి కూరగాయలు అమ్ముతుందన్న కొమురం 
  • కష్టపడటమే ఆమెకి ఇష్టమని వెల్లడి 
  • షూటింగు లేకపోతే ఊళ్లోనే ఉంటానన్న కొమురం 
  • సంపాదించింది భూమిపైనే పెట్టానని వివరణ      

కొమరక్కగా పాప్యులర్ అయిన కొమురం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. 'ఇరుముడి' సినిమాలో ఆయన పోషించిన 'నాగులు' పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొమురం తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావిస్తూ వెళ్లాడు. "మేము షాద్ నగర్ దగ్గరలో ఉంటాము. మా ఇల్లు .. పొలాలు అక్కడే ఉంటాయి. ఒకప్పుడు ఒక దొర ఉన్న ఇల్లునే మేము కొనుక్కున్నాము" అని చెప్పాడు. 

" నటుడిగా నేను జబర్దస్త్ లో పేరు తెచ్చుకున్నా .. సినిమాలు చేస్తున్నా మా అమ్మ ఇప్పటికీ కూరగాయలు అమ్ముతూనే ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో సంతలో ఆమె కూరగాయలు అమ్ముకుని వస్తుంటుంది. మా నాన్న .. మా అన్నయ్య .. నేను కూడా వ్యవసాయం చేస్తాము. మాకు ఒక 40 బర్రెలు ఉన్నాయి. నేను కూడా పాలుపితుకుతూనే ఉంటాను. కష్టపడి పనిచేయడంలో సంతృప్తి ఉంటుంది. షూటింగ్ లేకపోతే నేను మా ఊళ్లోనే ఉంటాను" అని అన్నాడు. 

" హైదరాబాదులో ఒక చిన్న రూములో అద్దెకి ఉంటూ వేషాల కోసం తిరిగాను. నాకు వచ్చిన కొంతమొత్తంలోనే పొలాలు కొంటూ వెళ్లాను. మాకు ఇప్పుడు 20 ఎకరాల పొలం ఉంది .. అందులో 17 ఎకరాలు నేను కొన్నదే. పొలాలు  కొనాలనే ఆసక్తి నాకు మొదటి నుంచి ఉండేది. అందువలన తక్కువ రేట్లు ఉన్నప్పుడే కొనడం జరిగింది. అప్పట్లో జబర్దస్త్ చేసే వాళ్లందరికీ కూడా నేను చెప్పాను .. పొలాలు కొనమని. నా మాటను చాలామంది వినిపించుకోలేదు. ఆ తరువాత అయ్యో అంటూ బాధపడినవారు కూడా ఉన్నారు" అని చెప్పాడు.

Advertisement
Komuram
Jabardasth Komarakka
Irumudi Movie
Komuram Farming
Shadnagar
Telugu Actor

More Telugu News