నేపాల్ వరదల్లో 80 మంది ఈశా యాత్రికుల గల్లంతు.. కన్నీరుమున్నీరైన సద్గురు
- కొట్టుకుపోయిన గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం
- 9.05 గంటలకు చివరి సందేశం
- 9.14 గంటలకు భవనాన్ని ముంచిన వరద
- 12 గంటలుగా లేని బృందం ఆచూకీ
- గైరోంగ్‌కు వెళ్లేందుకు అనుమతి కోరిన సద్గురు
నేపాల్-టిబెట్ సరిహద్దులో వచ్చిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కైలాస యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది ఆచూకీ లేకుండా పోయింది. ఈ విషయం తెలియడంతో టిబెట్‌లోని ఈశా శిబిరంలో విషాదం నెలకొంది. సద్గురు జగదీశ్ వాసుదేవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
వరదల్లో భారీ నష్టం జరిగిన ప్రాంతానికి వెళ్లేందుకు సద్గురు ప్రయత్నించారు. అయితే అక్కడికి వెళ్లే మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత్, చైనా, అమెరికా దౌత్య కార్యాలయాల ద్వారా అనుమతి కోరుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొని యాత్రికుల కోసం గాలించాలనుకుంటున్నట్లు తెలిపారు.
కైలాస యాత్ర నుంచి తిరిగి వస్తున్న 80 మంది బృందం గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకుంది. బృంద నాయకుడు 'ఈశాంగ' ప్రవీణ్ ఉదయం 9.05 గంటలకు ఇషా ఫౌండేషన్‌కు సమాచారం పంపారు. ఆ తర్వాత కేవలం తొమ్మిది నిమిషాల్లోనే భారీ వరద వచ్చింది. 9.14 గంటలకు ఇమ్మిగ్రేషన్ కేంద్రం పూర్తిగా కొట్టుకుపోయింది.
‘వారం క్రితమే నేను ఆ భవనంలో ఉన్నాను. ఇప్పుడు అది పూర్తిగా కొట్టుకుపోయింది’ అని సద్గురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ రెండు దశాబ్దాలకు పైగా ఈశా ఫౌండేషన్‌తో పనిచేస్తున్నారని చెప్పారు.
బృందం నుంచి దాదాపు 12 గంటలుగా ఎలాంటి సమాచారం లేదు. ప్రవీణ్ నేపాల్ ఫోన్ నంబర్ కూడా యాక్టివ్ కాలేదు. దీంతో బృందం ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలోనే వరద ముంచెత్తి ఉండొచ్చని సద్గురు తెలిపారు.
నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో వరదలతో దాదాపు 300 మంది మృతి చెందారు. మరో 1,500 మంది ఆచూకీ తెలియడం లేదని సమాచారం. వీరిలో సుమారు 300 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.