రేవంత్ ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉంది: హరీశ్ రావు
- జాబితా నుంచి సీఎం ఇంటిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ
- నిషేధిత ఆస్తుల జాబితాపై విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
- సామాన్యుల పరిస్థితి ఏమిటన్న హరీశ్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నివాసానికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల గతి ఏమిటి?" అని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరపాలని, ఆ జాబితాలో ఉన్న ఆస్తులు పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆయన విమర్శించారు.