నెమళ్ల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు.. అందమైన ఈ పక్షుల్లో ఇన్ని ప్రత్యేకతలా!
- భారీ ఈకలున్నా నెమళ్లు ఎగరగలవు
- మగ పక్షిని పీకాక్, ఆడ పక్షిని పీహెన్, పిల్లలను పీచిక్స్ అంటారు
- ఈకలతో రహస్య సంకేతాలు పంపగలిగే సామర్థ్యం వాటి సొంతం
- వాటి రంగులు సహజ వర్ణాల వల్ల కాదంటున్న పరిశోధనలు
- కనిపించే భారీ ఈకలు తోక కాదు
నెమళ్లు అంటే అందమైన రంగురంగుల ఈకలు మాత్రమే కాదు.. వాటిలో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు కూడా ఉన్నాయి. అడవులు, వ్యవసాయ క్షేత్రాలు, నగరాల్లో కూడా కనిపించే ఈ పక్షులు తమ ప్రత్యేక లక్షణాలతో శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. నెమళ్ల గురించి చాలా మందికి తెలియని ఐదు ఆసక్తికరమైన విషయాలు ఇవే.
మగ పక్షినే ‘పీకాక్’ అంటారు
‘పీకాక్’ అనే పేరు మొత్తం జాతికి కాదు.. కేవలం మగ నెమలికే వర్తిస్తుంది. ఆడ పక్షిని ‘పీహెన్’, పిల్లలను ‘పీచిక్స్’ అని పిలుస్తారు. మగ నెమళ్లకు మాత్రమే రంగురంగుల ఈకలు ఉంటాయి. ఆడ నెమళ్లకు బూడిద, గోధుమ రంగు ఈకలు ఉండటం వల్ల అవి గూళ్ల వద్ద సులభంగా దాగి ఉంటాయి.
ఈకలతో సంకేతాలు పంపుతాయి
జత కోసం నెమలి నృత్యం చేసే సమయంలో ఈకలను వేగంగా కదిలిస్తుంది. దీనివల్ల మనకు వినిపించని తక్కువ తరంగదైర్ఘ్యం గల శబ్దాలు, కంపనలు ఏర్పడతాయి. ఆడ నెమళ్లు వాటిని గుర్తించి మగ నెమలి ఆరోగ్యం, బలం వంటి విషయాలను అంచనా వేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
భారీ ఈకలున్నా ఎగరగలవు
నెమళ్ల పొడవాటి ఈకలు చూసి అవి ఎగరలేవని చాలా మంది అనుకుంటారు. కానీ అవసరమైతే కొద్దిపాటి దూరం వరకు బలంగా ఎగరగలవు. ముఖ్యంగా శత్రువుల నుంచి తప్పించుకోవడానికి లేదా రాత్రి చెట్లపైకి చేరుకోవడానికి రెక్కలను ఉపయోగిస్తాయి.
భారీ ఈకలు తోక కావు
నెమలి విప్పే రంగురంగుల ఈకలను అందరూ తోకగా భావిస్తారు. కానీ అవి నిజమైన తోక కాదు. వాటిని ‘ట్రైన్’ అని పిలుస్తారు. అసలు తోక చిన్నదిగా ఉండి ఈకల కింద దాగి ఉంటుంది. అదే ఈ భారీ ఈకలను నిలబెట్టే ఆధారంగా పనిచేస్తుంది.
ఈకల రంగులు సహజ వర్ణాల వల్ల కావు
నెమలి ఈకల్లో కనిపించే నీలం, ఆకుపచ్చ మెరుపులు సహజ వర్ణాలకు కారణమయ్యే పదార్థాల వల్ల రావు. ఈకల్లోని సూక్ష్మ నిర్మాణాలు కాంతిని ప్రత్యేకంగా ప్రతిఫలించడం వల్ల ఆ రంగులు కనిపిస్తాయి. అందుకే సూర్యకాంతి పడే కోణాన్ని బట్టి ఈకల రంగు మెరుస్తూ మారుతున్నట్టు కనిపిస్తుంది.