- జీఎస్ఎల్వీ-ఎఫ్18 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రోకు జగన్ అభినందనలు
- ఇది దేశ స్వావలంబనను బలోపేతం చేసే విజయమని వ్యాఖ్య
- ఇస్రో శాస్త్రవేత్తల కృషి, మేధస్సు దేశానికి గర్వకారణమని ప్రశంస
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించి ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంపై వైసీపీ అధినేత జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ... "ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు హృదయపూర్వక అభినందనలు. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' బలోపేతంలో ఈ ప్రయోగం కీలక మైలురాయి. అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలో దేశ స్వావలంబనను మరింత బలోపేతం చేసే విజయం ఇది" అని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు కీలక సేవలు అందించడంలో ఈ ఉపగ్రహం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. "ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం, మేధస్సు, నిరంతర కృషి దేశానికే గర్వకారణం" అని ఆయన ప్రశంసించారు.
నిన్న రాత్రి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ను ప్రయోగించారు. ఎన్వీఎస్-03 ఉపగ్రహంతో భారతదేశ నావిగేషన్ వ్యవస్థ మరింత పటిష్ఠం కానుంది.