- రాప్తాడులో విద్యార్థినిపై దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన
- నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశం
- బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం కలెక్టర్‌తో ఆరా
- విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. తరగతి గదిలోకి చొరబడి ఓ ఉన్మాది విద్యార్థినిపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇలాంటి అమానుష ఘటనలకు సమాజంలో చోటు లేదని స్పష్టం చేశారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్.. అనంతపురం జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన ఆరా తీశారు.
దాడిలో గాయపడిన విద్యార్థినికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అదే ఘటనలో గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. బాధితురాలి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ దారుణ ఘటనపై తక్షణమే స్పందించి, కఠినమైన చర్యలకు ఉపక్రమించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.