- ఆరేళ్ల మేధాంశ్ కు రూ.50 లక్షల ఫార్చ్యూనర్ కారు
- రూ.200తో బామ్మ కొనుగోలు చేసిన కూపన్‌తో బహుమతి
- మేధాంశ్ మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ వాసి
- ఆభాపురిలో లక్కీ డ్రా నిర్వహణ
- రెండేళ్లుగా కారు కొనాలనుకుంటున్న కుటుంబం.. కల నెరవేరిన వైనం
కేవలం రూ.200 పెట్టి కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్.. ఏకంగా రూ.50 లక్షల విలువైన కారును గెలుచుకునేలా చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ అరుదైన అదృష్టం వరించింది. అతడి పేరు మేధాంశ్ రైక్వార్. బుర్హాన్‌పూర్‌లోని సీలంపురాకు చెందిన ఈ చిన్నారి టయోటా ఫార్చ్యూనర్ కారును గెలుచుకున్నాడు. బామ్మ కొనుగోలు చేసిన కూపన్ అతడి కుటుంబానికి ఈ అనూహ్యమైన ఆనందాన్ని తీసుకొచ్చింది.
మేధాంశ్ బామ్మ కిరణ్ రైక్వార్ ఏడాది క్రితం ఆభాపురిలో జరిగిన గర్బా వేడుకలకు వెళ్లారు. అక్కడ రూ.200తో లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేశారు. దానిపై తన మనవడి పేరు రాశారు. ఆ కూపన్ తమ కుటుంబానికి ఇంత పెద్ద బహుమతిని తెచ్చిపెడుతుందని ఆమె అప్పట్లో ఊహించలేదు.
2026లో శ్రీ సర్కార్ ధామ్ నిర్వహించిన లక్కీ డ్రా ఫలితాలు ప్రకటించగా.. తొలి బహుమతి మేధాంశ్ పేరుపై వచ్చింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. సుమారు రూ.50 లక్షల విలువైన ఫార్చ్యూనర్ కారు సొంతం కావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ కుటుంబం రెండేళ్లుగా సొంత కారు కొనుక్కోవాలని ఆశపడుతోంది. అనూహ్యంగా లక్కీ డ్రాలో కారు రావడంతో ఆ కల నెరవేరింది. మేధాంశ్ కు స్థానికులు, బంధువులు ఘన స్వాగతం పలికారు. డప్పుల మోతల మధ్య సంబరాలు చేసుకున్నారు. కొత్త కారుకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.