భారత్‌లో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్.. 7,000mAh బ్యాటరీతో పాటు అదిరే ఫీచర్లు

Oppo Reno 16 Series launch in India with 7000mAh battery and amazing features
  • ఒప్పో రెనో 16, రెనో 16సీ భారత్‌లో విడుదల
  • ధరలు రూ.46,999 నుంచి రూ.67,999 వరకు
  • రెనో 16లో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4, రెనో 16సీలో డైమెన్సిటీ 7300 చిప్
  • రెండు ఫోన్లలోనూ 50ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 6,700mAh, 7,000mAh బ్యాటరీలు
ఒప్పో తన కొత్త రెనో 16 సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16సీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఆకర్షణీయమైన అమోలెడ్‌ డిస్‌ప్లే, 50ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, ఏఐ ఆధారిత ఫీచర్లతో ఈ ఫోన్లు వచ్చాయి. జులై 9 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక స్టోర్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఒప్పో రెనో 16లో 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.61,999. 12జీబీ+256జీబీ ధర రూ.67,999గా నిర్ణయించారు. ఒప్పో రెనో 16సీలో 8జీబీ+128జీబీ ధర రూ.46,999, 8జీబీ+256జీబీ ధర రూ.49,999, 12జీబీ+256జీబీ ధర రూ.55,999గా ఉంది. 

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. 

స్టారీ వైట్‌, సెల్లార్‌ పర్పుల్‌, ట్విలైట్‌ వయోలెట్‌ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత కలర్‌ఓఎస్‌ 16తో వస్తున్నాయి. రెనో 16లో 6.32 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. రెనో 16సీలో 6.57 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. 

రెనో 16లో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 ప్రాసెసర్, 12జీబీ ఎల్‌పీడీడీఆర్‌5ఎక్స్‌ ర్యామ్, 256జీబీ యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజ్ ఉంది. రెనో 16సీలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ ర్యామ్, గరిష్ఠంగా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ అందించారు.

రెనో 16లో ఓఐఎస్‌ సపోర్ట్‌తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్, 50ఎంపీ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. రెనో 16సీలో 50ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ సెల్ఫీల కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 

రెనో 16లో 6,700mAh బ్యాటరీ, రెనో 16cలో 7,000mAh బ్యాటరీ అందించారు. రెండింటికీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 

ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 5జీ, వైఫై, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సీ, జీపీఎస్‌, ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే  డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు కూడా ఉన్నాయి.
Oppo Reno 16 Series
Oppo Reno 16c price India
7000mAh battery smartphone
Snapdragon 7 Gen 4
Oppo Reno 16 features
Oppo mobile launch India

More Telugu News