- ఐఫోన్ డ్యుయో డిస్‌ప్లేపై పగుళ్లు, తెల్లటి గీతల సమస్యలు
- హింజ్ డిజైన్ లోపం కారణం కావొచ్చని ఐఫిక్సిట్ అంచనా
- ఫోన్ మడిచినప్పుడు డిస్‌ప్లేపై ఒత్తిడి పెరిగే అవకాశం
- విద్యుత్ కనెక్షన్లు దెబ్బతిన్నా పిక్సెల్స్ పనిచేయకపోవచ్చన్న ఐఫిక్సిట్
- వారంటీ లేని డిస్‌ప్లే రిపేర్ ఖర్చు రూ.1,49,900 వరకు ఉండొచ్చని అంచనా
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో కొనుగోలు చేసిన కొందరికి కొత్త చిక్కు ఎదురైంది. ఫోన్‌ను మడుస్తున్నప్పుడు శబ్దాలు రావడం, లోపలి డిస్‌ప్లేపై పగుళ్లు ఏర్పడటం, తెల్లటి గీతలు కనిపించడం వంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ సమస్యకు గల కారణాలపై ‘ఐఫిక్సిట్’ పరిశీలనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ హింజ్ డిజైన్‌లో లోపం ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, ఇదే అసలు కారణమని ఇంకా నిర్ధారణ కాలేదు.
ఐఫిక్సిట్ బృందం ఐఫోన్ డ్యుయో హింజ్‌కు సంబంధించిన 3డీ నమూనాను రూపొందించింది. టియర్‌డౌన్ వీడియోలు, పేటెంట్లు, సీటీ స్కాన్ల ఆధారంగా ఫోన్ మడిచినప్పుడు ఏ ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఏర్పడుతుందో పరిశీలించింది.
డిస్‌ప్లే కేబుల్ వెళ్లే ఖాళీ ప్రాంతం, హింజ్‌కు మధ్యలో ఉండే సపోర్ట్ భాగం కలిసే చోట సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించింది. ఫోన్ మూసినప్పుడు మధ్యలో ఉండే సపోర్ట్ బార్ పూర్తిగా వెనక్కి జరగకపోతే డిస్‌ప్లేపై ఒత్తిడి పెరగొచ్చని వివరించింది. హింజ్‌ను కదిలించే రైల్స్ సరిగ్గా పనిచేయకపోయినా స్క్రీన్ దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది.
కొంతమంది వినియోగదారులు ఫోన్‌ను కొన్నిసార్లు మాత్రమే మడిచినా డిస్‌ప్లేపై పగుళ్లు లేదా తెల్లటి గీతలు కనిపించాయని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. డిస్‌ప్లేలోని సన్నని పొరలపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని ఐఫిక్సిట్ తెలిపింది. స్క్రీన్ బయటకు పగలకపోయినా, దానిలోని విద్యుత్ కనెక్షన్లు దెబ్బతింటే పిక్సెల్స్ వరుసగా పనిచేయకపోవచ్చని వివరించింది. అయితే, ఇవన్నీ ప్రాథమిక అంచనాలే.
ఐఫోన్ డ్యుయో లోపలి డిస్‌ప్లే మరమ్మతుకు వారంటీ వర్తించకపోతే రూ.1,49,900 ఖర్చవుతుందని సమాచారం. డిస్‌ప్లే సమస్య ఎదురైన వినియోగదారులకు యాపిల్ ఉచితంగా రీప్లేస్‌మెంట్ ఫోన్లు అందిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో 256 జీబీ వేరియంట్‌కు రూ.2,99,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 2 టీబీ మోడల్ ధర రూ.4,49,900.