ప్రకాశ్ రాజ్‌ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి: బీజేపీ నేత
- వివాదాస్పద యూట్యూబర్‌కు మద్దతివ్వడమే బీజేపీ నేత ఫైర్
- సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై యూట్యూబర్ అనుచిత వ్యాఖ్యలు
- యూట్యూబర్ అరెస్టును ప్రశ్నించిన నటుడు ప్రకాశ్ రాజ్
- ప్రకాశ్ రాజ్ తీరు సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శ
హైదరాబాద్‌కు చెందిన రావణ్ అనే యూట్యూబర్‌ను అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలా అరెస్టులు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకాశ్ రాజ్ తీరు సిగ్గుచేటని, ఆయన వ్యక్తిగత దూషణలను, మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.