ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి.. పెబ్బేరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

RTC bus accident in Wanaparthy district leaves ten injured
  • మంత్రాలయం నుంచి వనపర్తికి బస్సు వస్తుండగా ప్రమాదం
  • తీవ్రంగా గాయపడ్డ 10 మంది ప్రయాణికులు
  • క్షతగాత్రులకు పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో నేడు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెబ్బేరు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం నుండి వనపర్తికి బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 


బస్సు స్పీడ్‌గా వెళుతున్న సమయంలో.. అకస్మాత్తుగా ముందు వెళ్తున్న ఒక ద్విచక్రవాహనం అడ్డం వచ్చింది. ఆ బైక్‌ను తప్పించేందుకు బస్సు డ్రైవర్ స్టీరింగ్‌ను ఒక్కసారిగా తిప్పడంతో బస్సు కంట్రోల్ తప్పి హైవే పక్కనే బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు లాగారు. గాయపడిన ఆ 10 మంది క్షతగాత్రులను చికిత్స కోసం పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


RTC Bus
Pebberu road accident
Wanaparthy bus overturn
Telangana road news
Mantralayam Wanaparthy bus
RTC bus accident today

More Telugu News