- రామాంతపూర్ పెద్ద చెరువు వద్ద నిర్మాణాల కూల్చివేత
- చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని తెలిపిన అధికారులు
- 40 ఏళ్లుగా పన్నులు కడుతున్నామంటున్న యజమానులు
- అధికారుల చర్యలపై హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఉన్న పెద్ద చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను 'హైడ్రా' అధికారులు కూల్చివేశారు. చెరువు స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడే చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ఉన్న ఓ భారీ షెడ్డును అధికారులు తొలగించారు. అధికారుల చర్యలతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆస్తుల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఏళ్లుగా తాము క్రమం తప్పకుండా పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని వారు తెలిపారు. గత మూడు రోజులుగా అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తాము హైకోర్టును ఆశ్రయించామని బాధితులు వివరించారు.
ముందుగా చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను స్పష్టంగా నిర్ణయించాలని, ఆ తర్వాతే చట్టపరమైన తమ భూములపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలోనూ ఇదే చెరువు పరిధిలో కూల్చివేతలు చేపట్టి, కొంత భూమిని పునరుద్ధరణ పనుల కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.