- బేగంపేట గర్ల్స్ హాస్టల్‌పై పోలీసుల ఆకస్మిక దాడి
- హాస్టల్ ముసుగులో అక్రమంగా ఫెర్టిలిటీ రాకెట్ నిర్వహణ
- పలు రాష్ట్రాల యువతుల నుంచి అండాల సేకరణ, అమ్మకం
- పది మంది యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వివిధ ఐవీఎఫ్ కేంద్రాలకు అండాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానం
హైదరాబాద్‌లోని బేగంపేటలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో సాగుతున్న భారీ అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. ప్రకాశ్ నగర్‌లోని 'అమినీత గర్ల్స్ హాస్టల్'పై బేగంపేట పోలీసులు, మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ అక్రమ దందాను వెలుగులోకి తెచ్చింది.
ఏడాది కాలంగా మహిళల హాస్టల్ పేరుతో ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి వివిధ రాష్ట్రాల నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి, వారి నుంచి అండాలను సేకరించి పలు సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కేవలం అండాలే కాకుండా, కొందరు పురుషుల నుంచి వీర్య నమూనాలను కూడా సేకరించినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి.
ఈ దాడుల్లో భాగంగా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, వారు ఇచ్చే సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. గర్ల్స్ హాస్టల్ పేరుతో అత్యంత రహస్యంగా ఈ అక్రమ దందాను నిర్వహించడం కలకలం సృష్టించింది. ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఏయే ఫెర్టిలిటీ కేంద్రాలతో వీరికి సంబంధాలు ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.