- బ్యాంకు ఆస్తుల విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారని ఆరోపణ
- రిజర్వ్ ధర కంటే తక్కువకు బిడ్లు వస్తే నిబంధనలు మార్చడంపై ప్రశ్నలు
- ఉద్యోగుల ఆందోళనలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపాటు
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రతిపాదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు జాతి సంపదని, వాటి విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి అమ్మజూపడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు కీలక ప్రశ్నలు సంధించారు.
"ఐడీబీఐ బ్యాంకు విలువను తక్కువగా అంచనా వేస్తున్నారనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రిజర్వ్ ధర కంటే తక్కువకు బిడ్లు వచ్చినప్పుడు నిబంధనలు, మదింపు పద్ధతులను ఎందుకు మార్చారు? ఐడీబీఐ ఉద్యోగులు లేవనెత్తుతున్న ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు?" అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో బ్యాంకుకు అత్యంత విలువైన భూములు, స్థిరాస్తులు ఉన్నాయని, వాటి విలువను సరిగ్గా లెక్కించారా? లేదా? అని నిలదీశారు. "ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేటుపరం చేసే ముందు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలి. ఇంత తొందర ఎందుకు?" అని ఆయన అన్నారు.