తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని ఆమె ఆరోపించారు. కొడంగల్‌లోని పున్నంచంద్ లాహోటి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, గట్టు లిఫ్ట్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించడమేంటని ఆమె మండిపడ్డారు.

కొడంగల్‌లో రోడ్డు విస్తరణ పనుల కోసం ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ముందుగా నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పరిహారం ఇవ్వకుండా వారిని ఎలా ఖాళీ చేయిస్తారని ముఖ్యమంత్రిని ఆమె నేరుగా ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరైన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై తక్షణమే దృష్టి సారించాలని సూచించారు.