తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (IPASE) 2026 ఫలితాలను విడుదల చేసింది. మే 13 నుంచి మే 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరైన ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.

ప్రధాన పరీక్షల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం బోర్డు ఈ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించింది. జనరల్, ఒకేషనల్ విభాగాలకు చెందిన మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకునే విధానం:
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్లయిన tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'IPASE 2026 Result' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • జనరల్ లేదా ఒకేషనల్ స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకుని, మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • 'Submit' బటన్‌పై క్లిక్ చేయగానే మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • భవిష్యత్ అవసరాల కోసం ఈ మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం మంచిది.