తెలంగాణలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
- హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం
- ఘట్‌కేసర్‌లో వడగళ్ళ వర్షం
- మార్కెట్ యార్డులు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో తడిచిన ధాన్యం
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాజధాని నగరంలోని వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో భారీగా వచ్చిన ఈదురుగాలులకు ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ఘట్‌కేసర్‌లో వడగళ్ల వర్షం కురిసింది. మెదక్, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షం కురవడంతో ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మెదక్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మెదక్ సహా పలు ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో బస్తాలు తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.