గంటకు రూ.350.. ఏఐ హెడ్‌గేర్‌తో కూరగాయలమ్మే కుర్రాడి అదనపు సంపాదన!

Vegetable Vendor Earns Extra Income with AI Headgear in Bangalore
  • బెంగళూరులో ఏఐ పరికరంతో కూరగాయల వ్యాపారి
  • తలపై ఐఫోన్‌తో డేటా కలెక్ట్ చేస్తున్న విజువల్స్
  • ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం సమాచార సేకరణ
  • గంటకు రూ.350 చొప్పున అదనపు ఆదాయం
  • వైరల్ అవుతున్న వీడియో
బెంగళూరుకు చెందిన కూరగాయలు అమ్మే ఓ కుర్రాడు సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాడు. తలపై ఐఫోన్, మెమొరీ కార్డ్ అమర్చిన ఒక వింత పరికరాన్ని పెట్టుకుని అతను కూరగాయలు అమ్ముతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టెక్ సిటీ బెంగళూరులో ఐటీ ఉద్యోగులకే కాదు, చిరువ్యాపారులకూ ఏఐ టెక్నాలజీ ఎంతలా కనెక్ట్ అయిందో ఈ ఘటన తెలియజేస్తోంది.

ఐఫోన్‌తో డేటా కలెక్షన్
వైభవ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ట్రైనింగ్ కోసం కంపెనీలు ఇలాంటి గ్రౌండ్ లెవెల్ డేటాను సేకరిస్తుంటాయి. సదరు వ్యాపారి తన రోజువారీ పని చేసుకుంటూనే.. ఈ హెడ్‌గేర్ ద్వారా నగర వీధుల్లోని వీడియో, ఆడియో, లొకేషన్ సమాచారాన్ని రికార్డ్ చేస్తూ కంపెనీలకు అందిస్తున్నాడు.

నెలకు రూ.లక్ష?
ఈ వినూత్న ప్రయత్నం ద్వారా అతను గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ లెక్కన రోజుకు 10 గంటలు పనిచేస్తే రూ.3,500.. అంటే నెలకు ఏకంగా రూ.1,05,000 వరకు సంపాదించొచ్చని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాదాసీదా కార్పొరేట్ ఉద్యోగుల కంటే ఈ కూరగాయల వ్యాపారే ఎక్కువ ఆర్జిస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

నెటిజన్ల డౌట్లు
ఈ వీడియోకు ఇప్పటికే 53 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కొందరు దీన్ని అదనపు ఆదాయానికి చక్కని మార్గంగా అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం సంపాదన లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంటకు రూ.350 ఇస్తున్న మాట నిజమే అయినా.. ఈ ప్రాజెక్టులు కేవలం 10 నుంచి 20 గంటల పనితోనే ముగిసిపోతాయని, నెలంతా ఇలాంటి ఆదాయం రావడం సాధ్యం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Vegetable Vendor
Bangalore
AI Headgear
Artificial Intelligence
Data Collection
Income
Viral Video
Tech City
Street Vendor
Extra Income

More Telugu News