- ఉద్యోగాల పేరుతో మోసం చేసి సైన్యంలోకి బలవంతంగా పంపిన వైనం
- తమను కాపాడాలంటూ వీడియోల ద్వారా వేడుకుంటున్న బాధితులు
- స్పందించిన మంత్రి నారా లోకేశ్.. అధికారులకు కీలక ఆదేశాలు
- ఐదుగురిలో ముగ్గురి ఆచూకీ రెండు నెలలుగా గల్లంతు
మెరుగైన ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన విశాఖపట్నం, పరిసర ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు అక్కడ మోసపోయి, ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయారు. ఉద్యోగాల పేరిట ఏజెంట్లు తమను మోసం చేసి రష్యా సైన్యంలో బలవంతంగా చేర్పించారని, ప్రాణాలతో తిరిగి వస్తామో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇద్దరు యువకులు వీడియో సందేశాలు పంపారు.
గాజువాక మండలం, దువ్వాడ సమీపంలోని జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీకి చెందిన జెట్టి వంశీ సహా ఐదుగురు యువకులు గత ఏడాది జులైలో రష్యాకు వెళ్లారు. రష్యా సైన్యానికి ఫుడ్ ప్యాకింగ్ అందజేయడం వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన ఏజెంట్లకు ఒక్కొక్కరు సుమారు రూ. 3.6 లక్షల వరకు చెల్లించారు. అయితే, అక్కడికి వెళ్లాక వారిని మోసగించి బలవంతంగా సైన్యంలో చేర్పించారు. వీరిలో ముగ్గురిని సుమారు రెండు నెలల క్రితం తీవ్రమైన యుద్ధ ప్రాంతానికి తరలించగా, అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియడం లేదు.
ప్రస్తుతం వంశీ, అతడి స్నేహితుడు సతీశ్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. సైనిక దుస్తుల్లో ఉన్న వారు పంపిన వీడియోలో, తమ ఇష్టానికి విరుద్ధంగా యుద్ధంలోకి పంపుతున్నారని, ప్రాణభయంతో ఉన్నామని, వెంటనే తమను కాపాడాలని కన్నీటితో వేడుకున్నారు. దీంతో వంశీ తల్లి అప్పలకొండ, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు వారు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. యువకులను సురక్షితంగా, వేగంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరోవైపు, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చలు జరుపుతోంది.