హైదరాబాద్‌లో ఏటీఎం సెంటర్‌లో వ్యక్తి మృతదేహం
- విజయ్ నగర్ కాలనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో వ్యక్తి మృతదేహం
- పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
- ప్రమాదవశాత్తు మృతి చెందాడా, హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేసి పడవేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.