హైదరాబాద్‌లో వడగళ్ల వాన... రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్
- వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన
- హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- ఘట్‌కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం
రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈరోజు మధ్యాహ్నం వర్షం కురిసింది. ఆ తర్వాత కాస్త తెరిపిచ్చినప్పటికీ, సాయంత్రం మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.