Winter Olympics: వింటర్ ఒలింపిక్స్‌లో వింత సమస్య... కండోమ్‌లకు కరవు!

Winter Olympics Condom Shortage Reported in Milan Cortina
షార్ట్స్‌లో చూడండి
ఇటలీలోని మిలాన్-కోర్టినాలో జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్‌లో ఒక చిత్రమైన సమస్య తలెత్తింది. క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన కండోమ్‌ల స్టాక్ కేవలం మూడు రోజుల్లోనే పూర్తిగా అయిపోయింది. దీంతో నిర్వాహకులు వెంటనే కొత్త స్టాక్ కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది.

ఒలింపిక్స్ ప్రారంభమయ్యాక నిర్వాహకులు సుమారు 10 వేల కండోమ్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అయితే, 92 దేశాల నుంచి వచ్చిన దాదాపు 2,900 మంది అథ్లెట్లు ఉన్న క్రీడా గ్రామంలో ఈ నిల్వలు చాలా వేగంగా ఖాళీ అయ్యాయి. సరఫరా కేవలం మూడు రోజుల్లోనే అయిపోయిందని, కొత్త స్టాక్ ఎప్పుడొస్తుందో తెలియదని ఓ అథ్లెట్ చెప్పినట్లు ఇటాలియన్ మీడియా 'లా స్టాంపా' తన కథనంలో పేర్కొంది.

సాధారణంగా ఒలింపిక్స్‌లో అథ్లెట్లకు ఉచితంగా కండోమ్‌లు అందించడం 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి వస్తున్న సంప్రదాయం. సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహించడం, HIV/AIDS వంటి వ్యాధుల నివారణ దీని ముఖ్య ఉద్దేశం. గత 2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌లో 10,500 మంది అథ్లెట్ల కోసం 3 లక్షలకు పైగా కండోమ్‌లను అందించారు. అయితే, వింటర్ ఒలింపిక్స్‌లో అథ్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈసారి తక్కువ స్టాక్ తెచ్చారు.

అయితే, అథ్లెట్ల నుంచి ఊహించని స్థాయిలో డిమాండ్ రావడంతో ఈ 'కండోమ్ క్రైసిస్' ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్వాహకులు వెంటనే రంగంలోకి దిగారు. త్వరలోనే కొత్త స్టాక్‌ను క్రీడా గ్రామానికి తరలించి, ఒలింపిక్స్ ముగిసే వరకు కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Winter Olympics
2026 Winter Olympics
Milan Cortina
condoms
athletes
sports village
safe sex
HIV AIDS prevention
Italy
Olympics tradition

More Telugu News