ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త. భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వేదికను ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి మారుస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 13న జరగాల్సిన ఈ మ్యాచ్ వేదికలో మాత్రమే మార్పు చేసినట్లు వెల్లడించింది. తేదీ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఢిల్లీలో డిసెంబర్ నెలలో ఉండే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అలాగే స్టేడియంలో చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ వేదికను మార్చాలని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన బీసీసీఐ, తొలి వన్డేను విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి తరలించాలని నిర్ణయించింది. దీంతో డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డేకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు భారత గడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు.

శ్రీలంక భారత పర్యటన 2026 - పూర్తి షెడ్యూల్

వన్డే సిరీస్
తొలి వన్డే: డిసెంబర్ 13, ఆదివారం (మధ్యాహ్నం 2:00) - విశాఖపట్నం 
రెండో వన్డే: డిసెంబర్ 16, బుధవారం (మధ్యాహ్నం 2:00) - బెంగళూరు 
మూడో వన్డే: డిసెంబర్ 19, శనివారం (మధ్యాహ్నం 2:00) - అహ్మదాబాద్

టీ20 సిరీస్
తొలి టీ20: డిసెంబర్ 22, మంగళవారం (రాత్రి 7:00) - రాజ్‌కోట్ 
రెండో టీ20: డిసెంబర్ 24, గురువారం (రాత్రి 7:00) - కటక్ 
మూడో టీ20: డిసెంబర్ 27, ఆదివారం (రాత్రి 7:00) - పు